Delhi economy: ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై ఇండిగో సంక్షోభప్రభావం.. రూ.1,000 కోట్లు నష్టం
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో విమాన సంక్షోభం కారణంగా దిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు సుమారు రూ.1,000 కోట్లు నష్టపరిచిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) వెల్లడించింది. విమాన రాకపోకల్లో ఏర్పడిన అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్ ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని వారు పేర్కొన్నారు. దీంతో, గత 10 రోజుల్లో దిల్లీ మార్కెట్లలో జనసంచారం సుమారు 25% తగ్గిందని CTI వివరించింది. దిల్లీ విమానాశ్రయం నుండి ప్రతి రోజు సుమారు 1.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, అందులో సుమారు 50,000 మంది వ్యాపారులు, బిజినెస్ ప్రయాణికులు ఉన్నారని పేర్కొన్నారు.
వివరాలు
తీవ్రంగా ప్రభావితమైన ఢిల్లీ ఎగ్జిబిషన్,ఈవెంట్స్ ఎకోసిస్టమ్
అంతేకాక, ఇండిగో విమానాల రద్దులు వ్యాపారుల రాకపోకలను తగ్గించాయని, ఫలితంగా టోకు మార్కెట్లు, రిటైల్ హబ్‌లకు నష్టాలు చేరాయన్నారు. గత ఒక వారంలోనే హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్‌లలో వేలాదిగా రద్దులు జరిగాయని చెప్పారు. ముఖ్యంగా, ఢిల్లీ ఎగ్జిబిషన్,ఈవెంట్స్ ఎకోసిస్టమ్ ఈ పరిస్థితికి తీవ్రంగా ప్రభావితమయ్యిందని ఆయన వెల్లడించారు. గత 10 రోజులుగా ప్రగతి మైదాన్, ఆనంద్ మండప ప్రాంతాల్లో ఆటోమొబైల్, చేనేత, వస్త్రాలు, గృహోపకరణాల వంటి పెద్ద స్థాయి ప్రదర్శనలు జరుగుతున్నాయి. కానీ, ఇండిగో విమానాల సంక్షోభం కారణంగా వీటిపై గణనీయమైన ప్రతికూల ప్రభావం ఏర్పడిందని స్పష్టం చేశారు.