NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం
    తదుపరి వార్తా కథనం
    ఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం
    ఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం

    ఇండిగో ఫ్లైట్ కి తప్పిన ముప్పు.. దిల్లీలో ల్యాండ్ అవుతుండగా రన్ వేను తాకిన తోక భాగం

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 13, 2023
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఓ విమానం త్రుటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకుంది.

    విమానం రన్ వేపైకి దిగుతున్న క్రమంలో దాని తోక భాగం నేలకు తాకింది. అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని క్షేమంగా ల్యాండింగ్ చేశారు.

    జూన్ 11న కోల్ కతా-దిల్లీ ఇండిగో వీటీ - ఐఎంజీ ఫ్లైట్ ల్యాండ్ అవుతన్న క్రమంలో ప్రమాదవశాత్తు దాని తోక భాగం నేలను తాకడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

    దీంతో పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటనలో ఎవరూ ప్రమాదం బారిన పడకపోవడంతో ప్రయాణికులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకోగలిగారు. అయితే సదరు ఫ్లైట్ దెబ్బతినడంతో తదుపరి సర్వీసులను అధికారులు నిలిపివేయడం గమనార్హం.

    DETAILS

    రన్ వే పైకి దిగుతున్న క్రమంలో ఫ్లైట్ భిన్నంగా కదిలింది : డీజీసీఏ

    ప్రమాదంలో ఫ్లైట్ తోక భాగం మాత్రమే దెబ్బతింది తప్ప మిగతా భాగాలన్నీ యధాతథంగానే ఉన్నాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డీజీసీఏ ) ప్రకటించింది.

    అయితే కోల్ కతా నుంచి బయల్దేరిన విమానం దిల్లీలో ల్యాండ్ అయ్యేంత వరకు అటు ఇంజిన్ లోపాలు గానీ ఇటు ఇతర భాగాల్లో సమస్యలు గానీ తలెత్తలేదని స్పష్టం చేసింది.

    ఫ్లైట్ రన్ వే పైకి దిగే క్రమంలో సాధారణం కంటే భిన్నంగా విమానం కదులుతున్నట్లు పైలెట్లు గుర్తించారని ఈ నియంత్రణ సంస్థ పేర్కొంది.

    కిందకు దిగే సమయంలో విమానం తోక ఒక్కసారిగా రన్ వేను తాకిందని పేర్కొంది. ఘటనపై దర్యాప్తు చేపట్టామని డీజీసీఏ వివరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విమానం
    దిల్లీ
    విమానాశ్రయం

    తాజా

    Mumbai Airport: పార్కింగ్ విషయంలో డ్రైవర్లు, ముంబై విమానాశ్రయ సిబ్బంది మధ్య తీవ్రమైన ఘర్షణ  ముంబై
    Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా

    విమానం

    టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం ఇంజిన్‌లో మంటలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎయిర్ ఇండియా
    ఎయిరేషియా ఎయిర్‌లైన్స్‌కు రూ. 20లక్షల జరిమానా విధించిన డీజీసీఏ భారతదేశం
    ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా వ్యాపారం
    IT అంతరాయం వలన Lufthansa విమానాలు కొన్ని ఆలస్యం అయ్యాయి సంస్థ

    దిల్లీ

    ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి ఉత్తర్‌ప్రదేశ్
    ఆప్‌ నేత సత్యేందర్ జైన్‌కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  రాహుల్ గాంధీ
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్

    విమానాశ్రయం

    కోడి కత్తి కేసు: జగన్ రావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    1.5 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బంది అరెస్ట్ ఎయిర్ ఇండియా
    ఇండిగో విమానం పాకిస్థాన్‌లో అత్యవసర ల్యాండింగ్; ప్రయాణికుడు మృతి పాకిస్థాన్
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025