Loading...
IndiGo: 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం
17 వేల అడుగుల ఎత్తులో పిడుగు.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

IndiGo: 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు.. ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానానికి బుధవారం పెను ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తున్న విమానం సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ఉండగా పిడుగు తాకింది. దీంతో విమానం ముందుభాగంలో ఉండే రాడోమ్‌ దెబ్బతింది. ల్యాండింగ్‌ సమయంలో వడగళ్ల వాన కూడా ఎదురైంది. అయినప్పటికీ పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. పిడుగు తాకిన వేళ విమానం 6E 625 పాట్నా నుంచి లక్నోకు వెళ్తోంది. ఆ సమయంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు 17 వేల అడుగుల ఎత్తులో పిడుగు తాకడంతో విమానం ముందుభాగంలోని రాడోమ్‌ దెబ్బతింది.

వివరాలు 

విమానంలో104 మంది ప్రయాణికులు,ఆరుగురు సిబ్బంది

అనంతరం ల్యాండింగ్‌ సమయంలో వడగళ్ల వానను కూడా విమానం ఎదుర్కొంది.

పరిస్థితులను పైలట్లు సమర్థంగా నియంత్రించి లక్నోలోని చౌధరీ చరణ్‌సింగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా దించారు.

ఈ విమానంలో మొత్తం 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

వారంతా ఎలాంటి ప్రమాదం లేకుండా సురక్షితంగా విమానం నుంచి బయటకు వచ్చారు.

షెడ్యూల్‌ చేసిన సమయం కంటే ఎనిమిది నిమిషాల ముందుగానే విమానం ల్యాండ్‌ కావడం గమనార్హం.

పిడుగుపాటు, వడగళ్ల వాన కారణంగా రాడోమ్‌ దెబ్బతినడంతో విమానాన్ని వెంటనే గ్రౌండ్‌ చేశారు.

విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టిన తర్వాతే తిరిగి సర్వీసులోకి తీసుకురానున్నారు.

ఇందుకోసం సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు పొందాల్సి ఉంటుంది.

వివరాలు 

దర్యాప్తు ప్రారంభించిన DGCA

ఈ ఘటనపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) దర్యాప్తు ప్రారంభించింది.

ఘటనకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు వెంటనే అందించినట్లు ఇండిగో వెల్లడించింది.

అవసరమైన నిర్వహణ, మరమ్మతు పనులు పూర్తయిన తర్వాత.. నియంత్రణ సంస్థల అనుమతులు తీసుకుని విమానాన్ని తిరిగి సేవల్లోకి తీసుకువస్తామని తెలిపింది.

ఇండిగో విమానానికి ఇటీవల కూడా ఇలాంటి ప్రతికూల వాతావరణ ఘటన ఎదురైంది.

గత నెల గువాహటి నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండిగో విమానం.. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్‌ సమయంలో టెయిల్‌ స్ట్రైక్‌కు గురైంది.

బలమైన గాలులతో కూడిన ప్రతికూల వాతావరణం కారణంగానే ఆ ఘటన చోటుచేసుకున్నట్లు ఇండిగో అప్పట్లో వెల్లడించింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పిడుగు తాకడంతో రాడోమ్‌ ధ్వంసం.. ఇండిగో విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ADVERTISEMENT