LOADING...
 IndiGo flyers: ఇండిగో ప్రయాణికుల బ్యాగ్ మిస్సింగ్‌పై ఆందోళన
ఇండిగో ప్రయాణికుల బ్యాగ్ మిస్సింగ్‌పై ఆందోళన

 IndiGo flyers: ఇండిగో ప్రయాణికుల బ్యాగ్ మిస్సింగ్‌పై ఆందోళన

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
02:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో విమానయాన సేవలో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు తమ బ్యాగ్ మిస్సింగ్ అయినట్లు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేశారు. ఈ సమస్య ఇప్పటివరకు పరిష్కారం కాకపోవడం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఉదయం భారత్‌లోని అనేక విమానాశ్రయాల్లో దట్టమైన మబ్బులు (Dense Fog) కారణంగా విమాన సర్వీసులు ప్రభావితమయ్యాయి, దాంతో ప్రయాణికుల ఇబ్బందులు మరింత పెరిగాయి. ఈ సమస్యను అనేక ప్రయాణికులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో షేర్ చేసి, ఎయిర్లైన్స్‌ను ట్యాగ్ చేశారు, పరిష్కారం కోసం స్పందన కోరారు. "@AAI_Official 6e6725 7:45కి ల్యాండ్ అయింది, ఇంకా బ్యాగ్ బెల్ట్‌లో లేదు. ఇండిగో ప్రయాణికుల సమయం వృథా చేస్తున్నది @IndiGo6E" అని ఒక ప్రయాణికుడు ట్వీట్ చేశారు.

వివరాలు 

ఇండిగోను ట్యాగ్ చేసి..

"బ్యాగ్ ఆపరేషనల్ కారణాల వల్ల ఆలస్యమయ్యింది. మా టీమ్ దీనిపై పని చేస్తోంది, దయచేసి వారిని సంప్రదించండి" అని ఇండిగో స్పదించింది. మరో ప్రయాణికుడు DGCA (Directorate General of Civil Aviation), ఇండిగోను ట్యాగ్ చేసి, తన బ్యాగ్ నష్టానికి పరిహారం కోరారు. "@DGCAIndia @IndiGo6E, నా బ్యాగ్ నష్టానికి పరిహారం ఇస్తామని చెప్పి వారం అయ్యింది. ఇప్పటికి ఇంకా మీ నుండి ఎటువంటి స్పందన కూడా రాలేదు. Shame on you, IndiGo!" అని రాసుకొచ్చారు.

వివరాలు 

ఇండిగో నెగ్లిజెన్స్ కారణంగా బ్యాగ్ మిస్సింగ్

ఎక్స్ లో మరో ప్రయాణికుడు స్పందిస్తూ.. "ఇండిగో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగ్ ఎక్కడ ఉందో సమాచారం లేదు. రెండు నంబర్లను ఇచ్చారు, కానీ 10 గంటల నుండి ఎవరు ఫోన్ తీయట్లేదు. ఇండిగో కస్టమర్ కేర్ సంప్రదించిన తరువాత, ఒక గంట వెయిట్ చేసిన తర్వాత Case ID 30211855 ఇచ్చారు." ఎయిర్లైన్ సమస్యను పరిష్కరించడానికి మరింత సమయాన్ని కోరింది" అంటూ రాసుకొచ్చారు. నాలుగవ ప్రయాణికుడు ఇలా ట్వీట్ చేశారు:"ఇండిగో నెగ్లిజెన్స్ కారణంగా బ్యాగ్ మిస్సింగ్. మేము గ్రూప్‌గా ఇండిగో ఫ్లైట్ 6E 6379 (డెల్హి-పట్నా,28 డిసెంబర్ 2025) ప్రయాణించాము. సరైన చెక్-ఇన్, బ్యాగ్ ట్యాగ్ ఉన్నప్పటికీ, మా చెక్-ఇన్ బ్యాగ్ ఇండిగో అసమర్థత వల్ల మిస్ అయ్యింది. @IndiGo6E @DGCAIndia #IndiGo."

Advertisement

వివరాలు 

80 ఫ్లైట్‌లను రద్దు చేసిన ఇండిగో 

ఈ పరిస్థితుల్లో, సోమవారం ఇండిగో తన నెట్‌వర్క్‌లో సుమారు 80 ఫ్లైట్‌లను రద్దు చేసింది. వీటిలో సగం రద్దులు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి జరిగాయి. ఇండిగో వెబ్‌సైట్ ప్రకారం, ముంబై, బెంగుళూరు, కొచిన్, హైదరాబాద్, కోల్కతా, అమృత్‌సర్, చండీగఢ్, జైపూర్, డెహ్రాడూన్, ఇండోర్, పట్నా, భోపాల్ వంటి ప్రధాన విమానాశ్రయాలకూ ఫ్లైట్‌లను రద్దు చేసింది. ఇండిగో 11:20 AMకి జారీ చేసిన ట్రావెల్ అడ్వైజరీలో ఇలా పేర్కొంది.

Advertisement

వివరాలు 

 అనేక మంది ప్రయాణికుల బ్యాగ్ మిస్సింగ్ 

"ఢిల్లీ,ఉత్తరభారతంలోని అనేక ఎయిర్‌పోర్ట్‌లలో దట్టమైన మబ్బులు కొనసాగుతున్నాయి, కనిష్ట దృశ్యరేఖ ఇంకా పూర్తిగా మెరుగుపడలేదు. అందువల్ల,ఫ్లైట్ మోషన్‌లపై ప్రభావం మద్యాహ్నానికి కూడా కొనసాగవచ్చు, కొన్ని ఆలస్యాలు కొనసాగవచ్చు." ఈ నెల ప్రారంభంలో కూడా, ఇండిగో భారీ ఫ్లైట్ డిస్రప్షన్స్ వల్ల అనేక మంది ప్రయాణికులు బ్యాగ్ మిస్సింగ్ సమస్యకు లోనయ్యారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరినప్పటికీ, బ్యాగులు రాలేదు. తమ బ్యాగ్ తిరిగి పొందే సమయం తెలియని పరిస్థితి కొనసాగుతోంది .

Advertisement