Loading...
Indigo: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొన్న ఇండిగో విమానం
స్తంభాన్ని ఢీకొన్న ఇండిగో విమానం

Indigo: శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొన్న ఇండిగో విమానం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2026
11:28 am

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీనగర్‌ విమానాశ్రయంలో ఇండిగో విమానం ప్రమాదానికి గురైంది. పార్కింగ్‌ చేస్తుండగా విమానం ఎయిర్‌పోర్టులోని ఓ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ప్రయాణికులు, విమాన సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.

వివరాలు 

నవి ముంబై నుంచి శ్రీనగర్‌కు..

నవి ముంబై నుంచి శ్రీనగర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం శుక్రవారం ఉదయం 9:02 గంటలకు శ్రీనగర్‌ విమానాశ్రయానికి చేరుకుంది.

విమానాన్ని పార్కింగ్‌ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నట్లు ఇండిగో వెల్లడించింది.

ప్రమాదం తర్వాత ప్రయాణికులను మాన్యువల్‌ మెట్లను ఉపయోగించి విమానం నుంచి సురక్షితంగా దించినట్లు ఇండిగో తెలిపింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పేర్కొంది.

ప్రమాదానికి కారణమేంటి?

ఘటనపై శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

విచారణ పూర్తయిన తర్వాత ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలను నిర్ధారిస్తామని అధికారులు తెలిపారు.

విమానం పార్కింగ్‌ సమయంలో స్తంభాన్ని ఎలా ఢీకొట్టిందనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది.

వివరాలు 

కొనసాగిన విమానాల రాకపోకలు

ఈ ఘటన ప్రభావం విమానాశ్రయ కార్యకలాపాలపై పడలేదు. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయని ఇండిగో తెలిపింది.

విమానాల రాకపోకలు కూడా షెడ్యూల్‌ ప్రకారమే కొనసాగుతున్నాయని వెల్లడించింది.

ADVERTISEMENT