LOADING...
Indigo: ప్రయాణికులకు ఊరట.. అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు.. పూర్తి వివరాలు ఇవే
పూర్తి వివరాలు ఇవే

Indigo: ప్రయాణికులకు ఊరట.. అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు.. పూర్తి వివరాలు ఇవే

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2026
12:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొన్నాయి. దీంతో అనేక మంది ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ప్రస్తుత భద్రతా పరిస్థితులను సమీక్షించిన అనంతరం, సంబంధిత అధికారుల అనుమతితో కొన్ని అంతర్జాతీయ సర్వీసులను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. ఈ నిర్ణయం గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు, ముఖ్యంగా స్వస్థలాలకు తిరిగి రావాల్సిన వారికి పెద్ద ఉపశమనంగా మారింది. అలాగే అత్యవసర అవసరాల కోసం విదేశాలకు ప్రయాణించాల్సిన వారికి కూడా ఈ సర్వీసులు ఉపయోగపడనున్నాయి.

వివరాలు 

హైదరాబాద్ నుంచి కూడా సర్వీసులు

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు మంచి వార్త ఏమిటంటే హైదరాబాద్ నుంచి పలు అరబ్ నగరాలకు ఇండిగో విమానాలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి జెడ్డా, మదీనా, మస్కట్, షార్జా, అబుదాబి, రస్ అల్ ఖైమా నగరాలకు ఇండిగో సర్వీసులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణించే వారికి సౌలభ్యం ఏర్పడింది.

వివరాలు 

ఇండిగో విమాన సర్వీసుల జాబితా 12 మార్చి 2026:

6E 01: London - Mumbai (లండన్ - ముంబై) 6E 02: Mumbai - London (ముంబై - లండన్) 6E 21: Amsterdam - Mumbai (అమ్‌స్టర్‌డామ్ - ముంబై) 6E 22: Mumbai - Amsterdam (ముంబై - అమ్‌స్టర్‌డామ్) 6E 25: Mumbai - Amsterdam (ముంబై - అమ్‌స్టర్‌డామ్) 6E 58: Hyderabad - Madinah (హైదరాబాద్ - మదీనా) 6E 59: Madinah - Mumbai (మదీనా - ముంబై) 6E 61: Jeddah - Mumbai (జెడ్డా - ముంబై) 6E 62: Mumbai - Jeddah (ముంబై - జెడ్డా) 6E 63: Jeddah - Delhi (జెడ్డా - ఢిల్లీ)

Advertisement

వివరాలు 

ఇండిగో విమాన సర్వీసుల జాబితా 12 మార్చి 2026:

6E 64: Delhi - Jeddah (ఢిల్లీ - జెడ్డా) 6E 65: Jeddah - Kozhikode (జెడ్డా - కోజికోడ్) 6E 66: Kozhikode - Jeddah (కోజికోడ్ - జెడ్డా) 6E 67: Jeddah - Hyderabad (జెడ్డా - హైదరాబాద్) 6E 68: Hyderabad - Jeddah (హైదరాబాద్ - జెడ్డా) 6E 73: Riyadh - Mumbai (రియాద్ - ముంబై) 6E 74: Mumbai - Riyadh (ముంబై - రియాద్) 6E 77: Jeddah - Bengaluru (జెడ్డా - బెంగళూరు) 6E 78,: Bengaluru - Jeddah (బెంగళూరు - జెడ్డా) 6E 91: Jeddah - Mumbai (జెడ్డా - ముంబై)

Advertisement

వివరాలు 

ఇండిగో విమాన సర్వీసుల జాబితా 12 మార్చి 2026:

6E 92: Mumbai - Jeddah (ముంబై - జెడ్డా) 6E 1267: Muscat - Mumbai (మస్కట్ - ముంబై) 6E 1268: Mumbai - Muscat (మస్కట్ - ముంబై) 6E 1273: Muscat - Hyderabad (మస్కట్ - హైదరాబాద్) 6E 1274: Hyderabad - Muscat (హైదరాబాద్ - మస్కట్) 6E 1413: Abu Dhabi - Mumbai (అబుదాబి - ముంబై)

వివరాలు 

ప్రయాణికులు గమనించాల్సిన ముఖ్య విషయాలు

పరిస్థితులపై నిఘా: పశ్చిమాసియాలో పరిస్థితులు వేగంగా మారుతున్నందున విమానాల షెడ్యూల్‌లో స్వల్ప నోటీసుతో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అందువల్ల ప్రయాణికులు తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. ఫ్లైట్ స్టేటస్ తప్పనిసరిగా చెక్ చేయండి: విమానాశ్రయానికి బయలుదేరే ముందు ఇండిగో అధికారిక వెబ్‌సైట్‌లో లేదా సంబంధిత లింక్ ద్వారా తమ విమానం స్థితిని (Flight Status) తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. సహాయం కోసం హెల్ప్‌లైన్: ప్రయాణానికి సంబంధించిన సందేహాలు ఉంటే ఇండిగో హెల్ప్‌లైన్ నంబర్ +91 124 6173838 ను సంప్రదించవచ్చు. యుద్ధ పరిస్థితుల కారణంగా విమానాలు రద్దైన ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి ఇండిగో బృందాలు కృషి చేస్తున్నాయని సంస్థ వెల్లడించింది.

Advertisement