LOADING...
Shamshabad Airport: శంషాబాద్‌లో ఇండిగో సేవలకు అంతరాయం.. 69 విమానాలు రద్దు
శంషాబాద్‌లో ఇండిగో సేవలకు అంతరాయం.. 69 విమానాలు రద్దు

Shamshabad Airport: శంషాబాద్‌లో ఇండిగో సేవలకు అంతరాయం.. 69 విమానాలు రద్దు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 06, 2025
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండిగో విమానాల రాకపోకలకు నాలుగో రోజు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్‌ విమానాశ్రయానికి రాబోయే 26 విమానాలు, ఇక్కడి నుంచి బయలుదేరే 43 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడడానికి 5-10 రోజులవరకు సమయం పడే అవకాశం ఉంది. ఈ సమస్యను కేంద్రం తీవ్రంగా పరిగణించింది. మూడు రోజులలో పూర్తిస్థాయి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు.

Details

ప్రత్యేక చర్యలు చేపట్టిన రైల్వే శాఖ

ప్రయాణికుల సమస్యను పరిష్కరించడానికి విమానాశ్రయాల్లో ఉన్నవారిని గమ్యస్థానాలకు చేరవేయడానికి రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొత్తం 37 రైళ్లు, 116 అదనపు కోచ్‌లు జోడించాలని నిర్ణయించగా, ఇప్పటికే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అదనపు బోగీలతో ఆపరేట్ అవుతున్నాయి. ఈ చర్యలతో, ప్రయాణికులకు భద్రతా, సౌకర్య పరంగా తాత్కాలిక ఉపశమనం కల్పించబడ్డట్లు అధికారులు తెలిపారు.

Advertisement