తదుపరి వార్తా కథనం

Nellore: ఏమి పాపం చేశానమ్మా.. నెల్లూరు జిల్లాలో దారుణం
వ్రాసిన వారు
Stalin
May 19, 2024
12:02 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఆ తల్లి నవమాసాలు బిడ్డను కడుపులో మోసింది.పురుటి నొప్పులను భరించి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఆ ముక్కుపచ్చలారని పసికందు పుట్టిన కాసేపటికే చెరువులో విగతజీవిగా మారింది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి సమీపంలోని చెరువులో పురిటి బిడ్డ మృతదేహం లభ్యమైంది.
ఉదయం చెరువు వద్దకు వెళ్లిన స్థానికులకు మృతదేహం కనపడటంతో పోలీసులకు సమాచారం అందించారు.
ఆసుపత్రిలో డెలివరీ అయిన తర్వాత బిడ్డ మృతి చెందడంతో ఆబిడ్డను ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
ఉదయగిరి ప్రాంతంలోని ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీలకు సంబంధించిన సమాచారాన్నిపోలీసులు సేకరిస్తున్నారు.
మృతిచెందిన పురిటి బిడ్డ మృతదేహాన్ని పడేశారా..లేక బతికుండగానే పడేసారా..అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
పురిటిబిడ్డ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.