LOADING...
Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!
ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!

Rajasthan: ఐసీయూలో అమానుషం.. మహిళపై నర్సింగ్‌ స్టాఫ్‌ అత్యాచారం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ 32ఏళ్ల మహిళపై నర్సింగ్‌ సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం... బాధితురాలు ఐసీయూలో ఉండగా, ఆమె కుటుంబ సభ్యులు గదికి వెలుపలే వేచి ఉన్నారు. ఇదే సమయంలో నర్సింగ్‌ సిబ్బంది ఒకరు ఆమె బెడ్ చుట్టూ కర్టెన్‌లు వేసి మత్తు మందు ఇచ్చాడు. స్పృహలో సగం ఉన్న బాధితురాలు సాయం కోరేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.

Details

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో ఆమె భర్త ఆస్పత్రి సిబ్బందిని నిలదీయగా, వారు తొలుత ఈ ఆరోపణలను ఖండించారు. కానీ బాధితురాలి వాంగ్మూలం తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆస్పత్రి అధికారి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు.