ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ప్రగతి మైదాన్ సొరంగంలో గాయపడిన బైకర్ మృతి
దిల్లీలోని ప్రగతి మైదాన్ సొరంగంలో జరిగిన ప్రమాదంలో ఒక బైకర్ గాయాలతో మరణించాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్ నుంచి తిరిగి వస్తున్న 19 ఏళ్ల రాజన్‌రాయ్ సోమవారం రాత్రి సొరంగంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. సొరంగం లోపల ఫోన్ సిగ్నల్ సరిగా లేకపోవడంతో, బాటసారులు పోలీసులకు సమాచారం ఇవ్వలేకపోయారు. దీంతో అత్యవసర సేవలు సమయానికి అందకపోవడంతో ఆ యువకుడు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. సొరంగం లోపల ఫోన్ సిగ్నల్ వస్తే అతను బతికి ఉండేవాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతుున్నారు. 1.3 కి.మీ పొడవైన ప్రగతి మైదాన్ సొరంగం గత సంవత్సరం ప్రారంభించబడింది. ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్ట్‌లో భాగంగా దీన్ని నిర్మించారు. ఇందులో ప్రధాన సొరంగం, ఐదు అండర్‌పాస్‌లు ఉన్నాయి.