INS Anjadeep: 27న ఐఎన్‌ఎస్ అంజదీప్ కమిషనింగ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత నౌకాదళ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీఆర్‌ఎస్‌ఈ (GRSE), కోల్‌కతాలో నిర్మించిన యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ (ఏఎస్‌డబ్ల్యూ) సామర్థ్యాలు కలిగిన INS Arnala నౌకను ఈ నెల 27వ తేదీన కమిషన్ చేయనున్నట్లు నౌకాదళ వర్గాలు సోమవారం వెల్లడించాయి. ఆ రోజు ఈ యుద్ధ నౌకను ఇండియన్ నేవీ సేవల్లోకి అధికారికంగా చేర్చే కార్యక్రమం చెన్నై పోర్ట్ లో నిర్వహించనున్నట్లు తెలిపాయి.
వివరాలు
గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్ధ్యం
నౌక నిర్మాణ ప్రక్రియలో డాల్ఫిన్ హంటర్ ఇంజినీరింగ్ సాంకేతికతతో పాటు హల్‌మౌంటెడ్ సోనార్ 'అభయ్' వ్యవస్థను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. అదనంగా, తక్కువ బరువున్న టార్పెడోలు, రాకెట్ లాంచర్లు వంటి ఆయుధాలతో సముద్రతీర పర్యవేక్షణ, శోధన మరియు రక్షణ చర్యలకు అనుకూలంగా ఈ నౌకను రూపొందించారు. 77 మీటర్ల పొడవుతో నిర్మితమైన ఈ యుద్ధ నౌక గంటకు 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ నౌకను దినేష్‌కుమార్ త్రిపాఠి చేతులమీదుగా జాతికి అంకితం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.