
ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన Facebook-Instagram సర్వర్లు
ఈ వార్తాకథనం ఏంటి
మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook-Instagram Services) సేవలు మంగళవారం రాత్రి నిలిచిపోయాయి.
వినియోగదారులు తమ ఖాతాలకు (యూజర్ లాగిన్) లాగిన్ చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
వినియోగదారుల ఖాతాలు వాటంతట అవే లాగౌట్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అలాగే, ఇన్‌స్టాగ్రామ్‌లోని చాలా ఫీచర్లు పని చేయడం లేదు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండింటి నుంచి లాగౌట్ అయినట్లు వినియోగదారులు చెబుతున్నారు.
అంతరాయాలను ట్రాక్ చేసే 'అవుట్‌డెటెక్టర్' వెబ్‌సైట్ ప్రకారం, ఈ ప్లాట్‌ఫారమ్‌ల వేలాది మంది వినియోగదారులు యాప్, వెబ్ ఇంటర్‌ఫేస్‌తో వివిధ సమస్యలను నివేదించారు.
సోషల్ మీడియా
ట్విట్టర్ వేదికగా యూజర్లు ఆగ్రహం
ఇన్‌స్టాగ్రామ్‌లో 13,000 కంటే ఎక్కువ మంది వినియోగదారులు వెబ్‌సైట్, సర్వర్ కనెక్షన్, యాప్‌తో ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు హఠాత్తుగా షట్‌డౌన్ కావడంతో యూజర్లు తమ అకౌంట్‌లకు లాగిన్ కాలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియా ద్వారా యూజర్లు ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం రాత్రి 8:52 గంటలకు Facebook ఆగిపోయింది. 2021లో కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ సర్వర్లు డౌన్ అయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌లో రోజుకు 200 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు.