Inter Supplementary Examinations 2026: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఇంటర్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. జనరల్, వొకేషనల్ కోర్సులను కలిపి మొత్తం ఉత్తీర్ణత శాతం 70.58గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా మాట్లాడుతూ, విఫలమైన విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నెల రోజుల్లోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13, 2026 నుంచి ప్రారంభమవుతాయని ఆమె వెల్లడించారు.
వివరాలు
రోజుకు రెండు సెషన్లలో నిర్వహణ
ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభమవుతుందని, విద్యార్థులు సులభంగా మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకునే విధంగా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (థియరీ) మే 13, 2026 నుంచి రోజుకు రెండు సెషన్లలో నిర్వహించబడతాయి. అలాగే ప్రాక్టికల్ పరీక్షలు మే 22, 2026 నుంచి రెండు సెషన్లలో జరుగుతాయి. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజును ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 20, 2026 వరకు తమ సంబంధిత జూనియర్ కాలేజీల్లో చెల్లించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.