LOADING...
Narendra Modi: మోదీ టూర్‌పై ఆసక్తి.. వచ్చే నెలలో హైదరాబాద్‌కు రానున్నారా?
మోదీ టూర్‌పై ఆసక్తి.. వచ్చే నెలలో హైదరాబాద్‌కు రానున్నారా?

Narendra Modi: మోదీ టూర్‌పై ఆసక్తి.. వచ్చే నెలలో హైదరాబాద్‌కు రానున్నారా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 22, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా నగరంలో భారీ బహిరంగ సభలో పాల్గొనే ఆయన, అక్కడి నుంచే వర్చువల్ విధానంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని తెలుస్తోంది. ఈ సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్మించిన కొత్త బ్లాకులు, పలు జాతీయ రహదారుల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.

వివరాలు

త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం

అదేవిధంగా హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ రైల్వే ప్రాజెక్టు, ప్రాంతీయ వలయ రహదారి (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రానికి తొలిసారిగా రానుండటం విశేషంగా భావిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయనకు ఘనస్వాగతం పలకాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో జరిగిన పార్టీ సమావేశంలో సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రధాని అధికారిక పర్యటన షెడ్యూలుపై త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.

Advertisement