
లద్దాఖ్‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా
ఈ వార్తాకథనం ఏంటి
భారత్- చైనా కార్ప్స్ కమాండర్ స్థాయిలో జరిగిన 17వ సమావేశంలో సరిహద్దు వివాద పరిష్కారానికి ఎలాంటి ముందడుగు పడలేదు. తూర్పు లద్దాఖ్‌లోని డెప్సాంగ్ ప్లెయిన్స్, చార్డింగ్ నింగ్‌లుంగ్ నుల్లా జంక్షన్‌లో భారత సైన్యానికి పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరించడానికి చైనా అంగీకరించకపోవడంతో.. కొన్ని తాత్కాలిక నిర్ణయాలు తీసుకొని సమావేశాన్ని ముగించారు.
ఇరు దేశాల కమాండర్ల స్థాయి చర్చల్లో జరిగిన ఒప్పందాలకు సంబంధించి ఒక సంయుక్త ప్రకటను విడుదల చేశారు. సైనిక, దౌత్య మార్గాల్లో నిరంతరం చర్చలు జరపాలని, ఇలా చేయడం వల్ల శాశ్వత పరిష్కారం కనుగొనే వీలవుతుందని ఇరు దేశాల సైనికాధికారులు నిర్ణయించారు.
చైనా
మళ్లీ నిరాశే మిగిలింది..
అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో డిసెంబర్ 9న భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇది డిసెంబర్ 12న వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణను ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే ఈ ఘర్షణలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని భారత ప్రభుత్వం ప్రకటించింది.
తవాంగ్ సెక్టార్‌లో జరిగిన ఘర్షణ తర్వాత జరిగిన ఇరు దేశాల సైనిక అధికారుల సమావేశం ఎదో ఒక శాశ్వత పరిష్కార మార్గం చూపుతుందని అందరూ ఆశించారు. అయితే అలాంటిదేమీ జరగకుండా.. 16వ కమాండర్ల స్థాయి సమావేశం నిర్ణయాలకు కొనసాగింపుగా.. 17వ సమావేశం జరిగింది.