LOADING...
TG Inter Academic Calendar : జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం.. ఫైనల్ పరీక్షలు తదుపరి షెడ్యూల్‌ ఇదే!
జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం.. ఫైనల్ పరీక్షలు తదుపరి షెడ్యూల్‌ ఇదే!

TG Inter Academic Calendar : జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం.. ఫైనల్ పరీక్షలు తదుపరి షెడ్యూల్‌ ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
09:04 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్‌ను స్పష్టంగా ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో అన్ని ముఖ్య అంశాలను వివరించారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ క్లాసులు జూన్ 1 నుంచి ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు తెలిపింది. మొత్తం 304 విద్యా రోజుల్లో 224 పనిదినాలు కలిగివుంటాయి. మిగిలిన రోజులు సెలవులుగా ఉంటాయి.

వివరాలు

పరీక్షల షెడ్యూల్ కూడా రిలీజ్  

అక్టోబర్ 3 నుంచి 9 వరకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు 2027 జనవరి 18 నుంచి 23 వరకు ప్రీఫైనల్ పరీక్షలు ఆ తర్వాత వార్షిక ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం దసరా సెలవుల వ్యవస్థలో పెద్ద మార్పు: ఇంతకు ముందే ఇంటర్ విద్యార్థులు కేవలం 3-4 రోజులు మాత్రమే దసరా సెలవులు పొందేవారు, కానీ ఈ సంవత్సరం 12 రోజుల వరకూ సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఉంటాయి.

వివరాలు

ఇతర ముఖ్య సెలవులు

సంక్రాంతి సెలవులు: 2027, జనవరి 13-17 చివరి పని రోజు: మార్చి 27 వేసవి సెలవులు: మార్చి 28 నుంచి మే 30 సెక్రటరీ కృష్ణ ఆదిత్య ప్రైవేట్ కాలేజీలకు కూడా ఈ అకడమిక్ క్యాలెండర్ కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.

Advertisement