LOADING...
Partnership Summit: విశాఖలో నవంబర్ 14, 15న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు
విశాఖలో నవంబర్ 14, 15న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు

Partnership Summit: విశాఖలో నవంబర్ 14, 15న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 30, 2025
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా విశాఖపట్నంలో నవంబరు 14, 15 తేదీల్లో భాగస్వామ్య సదస్సు (Partnership Summit) నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం దక్షిణ కొరియాకు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులకు తెలిపారు. ఈ సదస్సులో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఎల్‌ఎస్ గ్రూప్, షూఆల్స్, ఎస్‌కె హైనిక్స్ వంటి కంపెనీల ప్రతినిధులు పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను పరిశీలించేందుకు ఆహ్వానితులుగా ఉన్నారు. దక్షిణ కొరియాలోని సియోల్‌లో మంత్రుల బృందం ఎల్‌జీ కంపెనీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ను వివరించింది. అలాగే ఎల్‌ఎస్ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమై విద్యుత్ ఉపకరణాల రంగంలో పెట్టుబడుల అవకాశాలను చర్చించారు. సంస్థ ప్రతినిధులు విశాఖలో పెట్టుబడుల ప్రతిపాదనలను పరిశీలించనున్నారు.

Details

కంపెనీలకు ప్రభుత్వ సహకారం

ప్రభుత్వ విధానాలు పారిశ్రామిక రంగానికి ఊతం కల్పిస్తాయని మంత్రులు వివరించారు. పూర్తి స్థాయి పెట్టుబడులతో వచ్చే కంపెనీలకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని వారు తెలిపారు. మెడికల్, స్మార్ట్ షూల తయారీ రంగంలో అగ్రగామి 'షూ ఆల్స్' సంస్థ ఛైర్మన్ చెవోంగ్ లీతో బృందం సమావేశమై పెట్టుబడుల ప్రతిపాదనలపై చర్చ చేసింది. అలాగే ఎస్‌కె హైనిక్స్ ప్రతినిధులకు మెమరీ మాడ్యూల్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటు అవకాశాలను మంత్రుల బృందం వివరించింది. ఏపీలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రాధాన్యం ఇచ్చారు. గ్లోబల్ గ్రోత్ స్ట్రాటజీ ఈవీపీ హెడ్ జున్ చోయ్‌లకు వివరాలు అందించడంలో బృందం వివరణ ఇచ్చింది. సీనియర్ అధికారులు ఎంటీ కృష్ణబాబు, కాటమనేని భాస్కర్, ఈడీబీ అధికారులు మంత్రుల వెంట ఉన్నారు.