Page Loader
Warangal: వరంగల్ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు
వరంగల్ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు

Warangal: వరంగల్ మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 07, 2024
06:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే ప్రాచుర్యం పొందిన చపాట మిరపకు తాజాగా అరుదైన గౌరవం లభించింది. ఈ మిరపకు జియోగ్రాఫిక్‌ ఇండికేషన్‌ (జీఐ) ట్యాగ్‌‌ను భారత ప్రభుత్వ పేటెంట్‌ ఆఫీస్‌ (ఐపీవో) ఆమోదించింది. ఇది ఈ ప్రాంతంలోని రైతులకు ఎంతో గర్వకారణమైన విషయమని చెప్పొచ్చు. చపాట మిరప వేరియంట్లు ఎర్రటి రంగులో ఉండి, తక్కువ కారం గలవే, ఈ వర్గం టమోటా వంటి ఆకారంలో ఉంటుంది. ఆ కారణంగా దీనిని 'టమోటా మిరప' అని కూడా పిలుస్తారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తును 2022లో తిమ్మంపేట మిర్చి రైతు ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ వేసింది.

Details

జీఐ ట్యాగ్ తో మరింత గుర్తింపు

వారు చేసిన కృషి వల్ల ఈ మిరపకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ఇంతకుముందు వరంగల్‌ వ్యవసాయ మార్కెట్లో చపాట మిరప క్వింటాల్‌కు రూ. లక్ష వరకు అమ్ముడయ్యింది. ఇప్పుడు జీఐ ట్యాగ్‌ పొందడం వల్ల ఈ మిరప మరింత గుర్తింపును సాధించనుంది.