Loading...
Andrapradesh :రేపటి నుంచి 'ఇంటింటికి తెలుగుదేశం'.. 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం
రేపటి నుంచి 'ఇంటింటికి తెలుగుదేశం'.. 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం

Andrapradesh :రేపటి నుంచి 'ఇంటింటికి తెలుగుదేశం'.. 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 26, 2026
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలో 'ఇంటింటికి తెలుగుదేశం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమం సోమవారం (జులై 27) నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్డీయే ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

వివరాలు 

లబ్ధిని ప్రజలకు స్పష్టంగా వివరించాలి 

గత ఏడాది నిర్వహించిన 'సుపరిపాలన తొలి ఏడాది' కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేసినట్లే, ఈసారి కూడా నాయకులు, కార్యకర్తలు అదే ఉత్సాహంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన 'సూపర్-6' హామీల అమలు, వాటి ద్వారా మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు పొందిన లబ్ధిని ప్రజలకు స్పష్టంగా వివరించాలని ఆయన సూచించారు.

అలాగే గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ అభివృద్ధి ఆధారిత పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పేర్కొన్నారు.

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

వివరాలు 

ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేయాలి 

కేవలం ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయడమే కాకుండా, ప్రజల నుంచి సమస్యలు, సూచనలు స్వీకరించి వాటి పరిష్కారానికి పార్టీ, ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకునేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.

కేంద్ర ప్రభుత్వం, మిత్రపక్షాల సహకారంతో రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను పల్లా శ్రీనివాసరావు కోరారు.

'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చారు.

ADVERTISEMENT