
Temporary Wrestling Body: ముగ్గురు సభ్యులతో డబ్ల్యూఎఫ్‌ఐ తాత్కాలిక కమిటీ ఏర్పాటు
ఈ వార్తాకథనం ఏంటి
డబ్ల్యూఎఫ్‌ఐ(WFI)కి ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ఏర్పాటు చేసింది.
ఈ కమిటీకి భూపేంద్ర సింగ్ బజ్వా చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో ఎంఎం సౌమ్య, మంజుషా కన్వర్‌లు సభ్యులుగా ఉన్నారు.
ఇటీవలే డబ్ల్యూఎఫ్‌ఐ ఎన్నికలు జరగ్గా.. ఇందులో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ గెలిచారు.
ఈ క్రమంలో సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ.. స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది.
బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును కూడా వాపస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో క్రీడా మంత్రిత్వ శాఖ డబ్ల్యూఎఫ్‌ఐ కొత్త బాడీని సస్పెండ్ చేసింది.
రెజ్లింగ్
డబ్ల్యూఎఫ్‌ఐ కార్యకలాపాలను పర్యవేక్షించనున్న ఐఓఏ
క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ డబ్ల్యూఎఫ్‌ఐ పనితీరు, కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ఆటగాళ్ల ఎంపిక, అంతర్జాతీయ స్థాయి టోర్నమెంట్‌లకు ఆటగాళ్ల పేర్లను పంపడం లాంటివి, టోర్నమెంట్ నిర్వహణ, పర్యవేక్షణను కూడా చూసుకుంటుంది.
అలాగే డబ్ల్యూఎఫ్‌ఐ బ్యాంకు ఖాతాను కూడా ఈ తాత్కాలిక కమిటీని నిర్వహిస్తుంది.
డబ్ల్యూఎఫ్‌ఐ కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని IOAకి ఇటీవల క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ లేఖ రాశారు.
రెజ్లింగ్ అనేది ఒక ఒలింపిక్ క్రీడ. ఈ క్రమంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు డబ్ల్యూఎఫ్‌ఐ అనుబంధంగా ఉంటుంది.