LOADING...
Rahul Gandhi: డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్, నిరసనల మధ్య.. హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ  
హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: డబ్ల్యూఎఫ్‌ఐ సస్పెన్షన్, నిరసనల మధ్య.. హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ  

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2023
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలోని అఖాడాలో ఒలింపిక్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా,ఇతర రెజ్లర్లను కలిశారు.కొన్ని వ్యాయామాలు చేశారు. ఈ సందర్భంగా బజరంగ్ పునియా మాట్లాడుతూ..రాహుల్ గాంధీ తెల్లవారు జామున మా వద్దకు వచ్చి మా రెజ్లింగ్ రోజువారీ వ్యాయామాలు చూశారు. రాహుల్ మాతోకలిసి రెజ్లింగ్ చేశారు. ఇటీవల నిర్వహించిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ)ఎన్నికలకు నిరసనగా సాక్షి మలిక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించగా.. బజ్‌రంగ్‌ పునియా, వీరేందర్‌ యాదవ్‌ పద్మశ్రీ అవార్డులను వాపస్‌ చేశారు. ఖేల్‌రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు వినేశ్‌ ఫొగాట్ ప్రకటించారు. ఇదే సమయంలో బ్రిజ్‌ భూషణ్ తాను రెజ్లింగ్‌ వ్యవహారాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. క్రీడారాజకీయాలకు దూరంగా ఉంటానని వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హర్యానాలో రెజ్లర్లను కలిసిన రాహుల్ గాంధీ 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రెజ్లర్లతో రెజ్లింగ్ చేస్తున్న రాహుల్