EAM Jaishankar: భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య చర్యలను వేగవంతం చేసింది. తాజా పరిణామాల్లో భాగంగా,ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ(Seyed Abbas Araghchi)భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఫోన్ చేసి ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై ఇద్దరు నేతలు వివరంగా మాట్లాడుకున్నారు. చమురు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్(Strait of Hormuz)జలసంధి మూసివేత ప్రమాదం,దాని ప్రభావం ప్రపంచ ఇంధన భద్రతపై ఎలా పడుతుందనే అంశంపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ చర్చలో ప్రాంతీయ అంశాలతో పాటు భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా ప్రస్తావించారు.
వివరాలు
కీలక దేశాలతో భారత్ నిరంతర సంప్రదింపులు
ఈ ఫోన్ సంభాషణకు ముందు జైశంకర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ విదేశాంగ మంత్రులతో కూడా మాట్లాడారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ కీలక దేశాలతో నిరంతర సంప్రదింపులు కొనసాగిస్తోంది. ఇదే సమయంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల గడువు విధిస్తూ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఈ దౌత్య చర్చలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. ఈ నేపథ్యంలో 'ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీతో ఫోన్‌లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై చర్చించాము' అని జైశంకర్ తన 'X' ఖాతాలో వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జైశంకర్‌కు చేసిన ట్వీట్
Received a call from Foreign Minister @araghchi of Iran. Discussed the present situation.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 5, 2026