IRCTC సర్వర్ డౌన్; రైలు టిక్కెట్ బుకింగ్‌లు నిలిపివేత
భారతీయ రైల్వే యొక్క ఈ-టికెటింగ్ విభాగం ఐఆర్‍సీటీసీ(IRCTC) సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల వెబ్‌సైట్, యాప్‌లో సేవలు నిలిచిపోయాయని మంగళవారం సంస్థ తెలిపింది. సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని, అత్యవరసం ఉన్నవారు మేక్‌మైట్రిప్, అమెజాన్ వంటి ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని ఐఆర్‍సీటీసీ తెలిపింది. ఐఆర్‍సీటీసీ వెబ్ పోర్టల్, యాప్‌లోని సేవలు ఉదయం 8 గంటల నుంచి నిలిచిపోయాయి. టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ప్రయత్నించిన కొందరి డబ్బులు కట్ అయ్యాయి. ఈ క్రమంలో వారికి భారతీయ రైల్వే తిరిగి డబ్బును తిరిగి ఇస్తుందా లేదా అనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.