LOADING...
AP Express: 25 రైళ్లలో ఈ-ప్యాంట్రీ సదుపాయం.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌కూ వర్తింపు
25 రైళ్లలో ఈ-ప్యాంట్రీ సదుపాయం.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌కూ వర్తింపు

AP Express: 25 రైళ్లలో ఈ-ప్యాంట్రీ సదుపాయం.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌కూ వర్తింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2026
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

రైల్లో ప్రయాణిస్తూ భోజనం ఆర్డర్‌ చేసుకునేలా ఐఆర్‌సీటీసీ ఈ-ప్యాంట్రీ సేవలను అమల్లోకి తీసుకొచ్చింది. మొదటగా వివేక్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రారంభమైన ఈ సదుపాయం ప్రస్తుతం 25 మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు విస్తరించింది. ఇందులో విశాఖపట్నం నుంచి నడిచే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ కూడా ఉంది. ప్యాంట్రీ కారు ఉన్న ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లోని 'టికెట్‌ హిస్టరీ' విభాగంలో ఈ-ప్యాంట్రీ మీల్‌ ఆప్షన్‌ ద్వారా భోజనాన్ని బుక్‌ చేసుకోవచ్చు. ఆర్డర్‌ పూర్తయ్యాక ఒక వెరిఫికేషన్‌ కోడ్‌ అందుతుంది. ఆ కోడ్‌ను భోజనం అందించే సమయంలో చూపిస్తే సరిపోతుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

25 రైళ్లలో ఈ-ప్యాంట్రీ సదుపాయం.. ఏపీ ఎక్స్‌ప్రెస్‌కూ వర్తింపు

Advertisement