Page Loader
Fire Broke Out In Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం.. 16 కార్లు దగ్ధం
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం

Fire Broke Out In Jubilee Hills : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అగ్నిప్రమాదం.. 16 కార్లు దగ్ధం

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 23, 2024
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. గణపతి కాంప్లెక్స్ సమీపంలో ఉన్న నాని కార్ కన్సల్టెంట్స్ వద్ద తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దీంతో ఈ ప్రమాదంలో 16కార్లు దగ్దమయ్యాయి. పేలుళ్లు, మంటలు పొరుగు భవనాల్లోకి వ్యాపిస్తాయనే భయంతో పక్కనే ఉన్న భవనాల్లోని ప్రజలు బయటకు పరుగులు తీయడంతో రద్దీగా ఉన్న ప్రాంతంలో కాసేపు భయాందోళనలు నెలకొన్నాయి. అయితే కార్లలో ఎక్కువ ఇంధనం లేకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యలు చేపట్టి మంటలు వ్యాపించకుండా అడ్డుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కార్‌ షోరూంలో అగ్నిప్రమాదం 16 కార్లు దగ్ధం