Loading...
Punjab: పంజాబ్‌లో కుప్పకూలిన ఇనుప వంతెన.. కాలువలో వేలాడిన రెండు లారీలు
పంజాబ్‌లో కుప్పకూలిన ఇనుప వంతెన.. కాలువలో వేలాడిన రెండు లారీలు

Punjab: పంజాబ్‌లో కుప్పకూలిన ఇనుప వంతెన.. కాలువలో వేలాడిన రెండు లారీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2026
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పాటియాలా-సంగ్రూర్ రహదారిపై భాక్రా కాలువపై నిర్మించిన ఇనుప వంతెన గురువారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న రెండు భారీ లారీలు కూడా వంతెనతోపాటు కిందకు పడిపోయాయి. అయితే అవి పూర్తిగా కాలువలో పడకుండా మధ్యలో వేలాడిపోయాయి. ఈ క్రమంలో లారీల్లో మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది.

వివరాలు 

డ్రైవర్లను సురక్షితంగా కాపాడిన సహాయక బృందాలు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

సహాయక చర్యలను ప్రారంభించారు. కాలువలో వేలాడుతున్న రెండు లారీల్లో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు లారీ డ్రైవర్లను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చాయి.

ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వంతెనపై రాకపోకలు నిలిపివేత

వంతెన కూలిపోవడంతో దాని పైభాగం నుంచి భాక్రా కాలువ నీరు ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.

పోలీసులు వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా సమీపంలోని మరో వంతెన మీదుగా వాహనాలను మళ్లిస్తున్నారు.

వివరాలు 

నిర్మాణ నాణ్యతపై అనుమానాలు

కాగా, ఈ జాతీయ రహదారితో పాటు వంతెనను సుమారు 2016లో నిర్మించినట్లు తెలుస్తోంది.

అయితే గతంలోనే ఈ వంతెనపై పగుళ్లు ఏర్పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వంతెన కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

లారీల్లో అధిక బరువు ఉండటంతో వంతెన ఆ భారాన్ని తట్టుకోలేక కూలిపోయిందా? లేదా నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉన్నాయా? అనే కోణాల్లో పరిశీలిస్తున్నారు.

నిర్మించి పదేళ్లు కూడా పూర్తికాకముందే వంతెన కూలిపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భాక్రా కాలువపై భారీ ప్రమాదం..

ADVERTISEMENT