Page Loader
Chandrababu Naidu: ACB కోర్టులో చంద్రబాబు కి ఊరట 

Chandrababu Naidu: ACB కోర్టులో చంద్రబాబు కి ఊరట 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 05, 2023
12:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ లో స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు అయిన ప్రతిపక్ష నేత,టిడిపి నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మరో రెండు కేసుల్లో చంద్రబాబును పీటీ వారెంట్ పై తమకు అప్పగించాలని సీఐడీ చేసిన విజ్ఞప్తిని ఏసీబీ కోర్టు ఇవాళ తోసిపుచ్చింది. చంద్రబాబు జైలులో ఉండగా ఇన్నర్ రింగ్ రోడ్డు,ఫైబర్ నెట్ కేసులలో విచారించాలని సీఐడీ పీటీ వారెంట్లు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు .. చంద్రబాబు బెయిల్ పై ఉన్నందున పీటీ వారెంట్లకు విచారణ అర్హత లేదని స్పష్టం చేసింది.