LOADING...
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అక్రమాలు.. అసలు బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్!
ఇంద్రకీలాద్రిపై అక్రమాలు.. అసలు బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్!

Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అక్రమాలు.. అసలు బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 31, 2026
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడలోని ఇంద్రకీలాద్రీలో వెలుగుచూసిన ఓ ఘటన కలకలం రేపుతోంది. దుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు సమయంలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది. భక్తులు సమర్పించిన బంగారాన్ని దారి మళ్లించేందుకు ప్రయత్నించిన వారు, అసలైన బంగారాన్ని రోల్డ్ గోల్డ్‌గా మార్చేందుకు యత్నించినట్టు గుర్తించారు. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తమైన ట్రస్ట్ బోర్డు సభ్యులు అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టగా, సిబ్బంది చేతివాటం బట్టబయలైంది. తనిఖీల సందర్భంగా సంబంధిత సిబ్బందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనలో రూ.1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులైన సిబ్బందికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేయగా, ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement