Bandi Sanjay: హెచ్‌సీఏలో అవకతవకలు.. సెలెక్షన్ కమిటీపై బండి సంజయ్ సీరియస్!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) functioningపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్, సీనియర్ స్థాయిలో జరుగుతున్న సెలెక్షన్ ప్రక్రియల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై ఆయన సీరియస్ అయ్యారు. గ్రామీణ ప్రాంతాల నుండి ప్రతిభావంతులైన క్రికెటర్లకు అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఆ అంశంపై వివరాలు సేకరించారు. సెలెక్షన్ కమిటీ సభ్యులపై చర్యలు తప్పవని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయంపై రాచకొండ పోలీసు కమిషనర్‌కు సమాచారం అందించానని తెలిపారు. సెలెక్షన్ కమిటీలో ఉన్న కొంతమంది సభ్యులు నైపుణ్యం లేని ఆటగాళ్లకు అవకాశాలు ఇచ్చి, వారితో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
Details
బీసీసీఐకి అధికారిక ఫిర్యాదు
ఈ వ్యవహారంపై తాను త్వరలోనే బీసీసీఐకి అధికారిక ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సెలెక్షన్ కమిటీలో లక్షల రూపాయల లావాదేవీలు జరిగినట్టు సమాచారం వచ్చింది. నైపుణ్యం ఉన్న క్రికెటర్ల తల్లిదండ్రులు తమ గోడును నాతో పంచుకున్నారు. గతంలో అద్భుత ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లను కూడా ఎంపిక చేయలేదని నా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంలో ఉన్న నిజాలు త్వరలోనే బయటపెడతామని బండి సంజయ్ హెచ్చరించారు. హెచ్‌సీఏలో జరుగుతున్న ఈ అవకతవకలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో సెలెక్షన్ కమిటీపై విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. తెలంగాణ క్రికెట్‌లో నైపుణ్యానికి మించిన సిఫార్సులు, లంచాలు ప్రభావం చూపుతున్నాయన్న ఆరోపణలు బహిర్గతమవుతుండటంతో, ఈ విషయం రాష్ట్ర క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.