
Punjab: పంజాబ్‌లో ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత, దేశవ్యాప్తంగా పాకిస్థాన్ గూఢచర్య కార్యకలాపాల చరమాంకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో,పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ)ఖలీస్థాన్‌కు చెందిన బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BKI) ముఠాలతో సంబంధాలున్న ఓ ఉగ్ర మాడ్యూల్‌ను పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ముఠా రెండు రోజుల క్రితం బటాలా ప్రాంతంలో జరిగిన గ్రెనేడ్ దాడికి బాధ్యతవహించినట్టు అధికారులు తెలిపారు.
అధికారుల ప్రకారం, ఐఎస్‌ఐ మద్దతుతో పనిచేస్తున్న ఈ ముఠాలో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు.
వారు బటాలాలోని ఓ మద్యం దుకాణం వద్ద గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి బీకేఐ నాయకుడు మన్నూ అగ్వాన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అమలు చేసినదిగా విచారణలో వెల్లడైంది.
వివరాలు
నిందితుల్లో ఒకరికి గాయాలు
నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో, వారు పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారు.
పోలీసులు ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ కాల్పుల్లో నిందితుల్లో ఒకరైన జతిన్‌కుమార్‌కు గాయాలయ్యాయి.
అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముఠా వద్ద నుంచి మొత్తం 30 తుపాకులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి, సదరు మాడ్యూల్ నేపథ్యం, కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.