ISRO : గగన్ యాన్ ప్రాజెక్టులో ఇస్రో కీలక ముందడుగు.. మనుషులు ప్రయాణించే ఇంజిన్లు సిద్ధం..
గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించి భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) కీలకు ముందడుగు వేసింది. మనుషులను సురక్షితంగా తీసుకెళ్లేందుకు అనువైన CE20 క్రయోజెనిక్ ఇంజిన్ ను సిద్ధం చేసినట్లు ప్రకటించింది. తుది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సోషల్ మీడియా ప్లాట్ ఫారం ఎక్స్ వేదికగా ఇస్రో వెల్లడించింది. మానవరహిత యాత్రకు వినియోగించే ఎల్వీఎం3 జీ1 కు వాడే ప్రమాణ పరీక్షలు విజయవంతంగా పూర్తయినట్లు పేర్కొంది. గగన్ యాన్ ప్రాజెక్టులో ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తైన కక్ష్యలోకి చేర్చి తిరిగా భూమిపైకా తీసుకురావాలని ఇస్రో నిర్ణయించింది. ఈ ప్రయోగం మూడు రోజుల పాటు జరగనుంది.
నాలుగో దేశంగా నిలువనున్న భారత్
ఈ ప్రయోగంలో ముగ్గురు వ్యోమగాములు సురక్షింతంగా సముద్రంపై దిగాల్సి ఉంటుంది. ప్రయోగం కచ్చితంగా విజయంతం అయ్యేందుకు అన్ని ఏర్పాట్లను ఇస్రో పూర్తి చేస్తోంది. రాకెట్ ఇంజిన్లలో హ్యూమన్ రేటింగ్ వ్యవస్థ చాలా కీలకం. మానవులు సురక్షితంగా ప్రయాణించేందుకు యంత్రాలు ఏమేరకు సరిపోతాయని ఈ వ్యవస్థ అంచనా వేస్తుంది. గగన్ యాన్ సంబంధించిన రాకెట్ ఇంజిన్లను ఫిబ్రవరి 13న చివరిసారిగా ఏడో సారి పరీక్షించారు. మహేంద్రగిరిలోని హై ఆల్టిట్యూట్ టెస్ట్ కేంద్రంలో ఇది పూర్తయింది. గగన్ యాన్ విజయవంతమైతే అంతరిక్షంలోకి మానవులను పంపిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది.