LOADING...
Supreme Court: 'పైలట్లే స్విచ్ ఆఫ్ చేశారనడం బాధ్యతారాహితం'.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
'పైలట్లే స్విచ్ ఆఫ్ చేశారనడం బాధ్యతారాహితం'.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court: 'పైలట్లే స్విచ్ ఆఫ్ చేశారనడం బాధ్యతారాహితం'.. ఎయిరిండియా ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) సమర్పించిన ప్రాథమిక నివేదికలో పైలట్ల పనితీరులో లోపాలు ఉన్నట్లు పేర్కొంది. దానిపై ఊహాజనిత కథనాలు రావడం దురదృష్టకరమని, అవి బాధ్యతారాహిత్యంగా పరిగణించాల్సినవని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. స్వతంత్ర దర్యాప్తు కోరుతూ వచ్చిన పిటిషన్లపై విచారణ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA), ఏఏఐబీకి నోటీసులు జారీ చేసింది.

Details

ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది

జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ప్రమాదం టేకాఫ్ అనంతరం కొన్ని సెకన్లలోనే ఇంధన కంట్రోల్ స్విచ్‌లు ఆగిపోవడం వల్ల సంభవించినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. ఒక పైలట్, మరో పైలట్‌ను "స్విచ్ ఎందుకు ఆఫ్ చేశావు?" అని ప్రశ్నించగా, తాను చేయలేదని సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో పేర్కొంది. ఆఖరి క్షణాల్లో కాక్‌పిట్‌లో ఇవే సంభాషణలు జరిగాయని కూడా ఏఏఐబీ వెల్లడించింది. రెండు స్విచ్‌లు ఒక సెకను తేడాతో ఆగిపోయాయని నివేదిక వివరించింది. అయితే దర్యాప్తు ఇంకా కొనసాగుతుందనీ, ప్రమాదానికి గల అసలు కారణాలను తుది నివేదికలో వెల్లడిస్తామని ఏఏఐబీ స్పష్టం చేసింది.

Details

ఊహాజనిత కథనాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యం

ఇదే సమయంలో అంతర్జాతీయ మీడియాలో పైలట్లు కావాలనే స్విచ్‌లు ఆఫ్ చేశారనే వార్తలు రావడం సంచలనం సృష్టించాయి. దర్యాప్తు పూర్తికాకముందే ఇలా ఊహాజనిత కథనాలు ప్రచురించడం బాధ్యతారాహిత్యమని ఏఏఐబీ ఖండించింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే ఫ్లైట్ డేటా రికార్డర్‌ను పరిశీలించేందుకు నిపుణులకు అనుమతి ఇవ్వాలని కోరారు.