దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా జగన్మోహన్ రెడ్డి; ఏడీఆర్ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో అత్యంత ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో పేర్కొంది.
ముఖ్యమంత్రి జగన్ ఆస్తుల విలువ రూ.510 కోట్లుగా ఏడీఆర్ నివేదించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన మొత్తం 30మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణస్వీకార పోల్ అఫిడవిట్‌లను విశ్లేషించిన తర్వాత ఈ నివేదికను తయారు చేసినట్లు ఏడీఆర్ పేర్కొంది.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తుల విలువ కేవలం రూ. 15లక్షలతో చివరి స్థానంలో నిలిచారు.
ఏడీఆర్
అప్పుల్లో అగ్రస్థానంలో నిలిచిన సీఎం కేసీఆర్
ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు అప్పుల్లో అగ్రస్థానంలో నిలిచినట్లు ఏడీఆర్ చెప్పింది. కేసీఆర్‌కు 8కోట్ల అప్పులు ఉన్నట్లు వెల్లడించింది.
కేసీఆర్ మొత్తం ఆస్తుల విలువ రూ.23.55 కోట్లు అని నివేదిక పేర్కొంది. మొత్తం తొమ్మిది మంది ముఖ్యమంత్రులు తమ అప్పుల విలువ కోటి రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ అని ప్రకటించారు.
మొత్తం 30మంది ముఖ్యమంత్రులలో 29మంది కోటీశ్వరులు కాగా, 13మంది సీఎంలు తమపై హత్యాయత్నం, కిడ్నాప్‌తో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు.
జగన్ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ ఉన్నారు. ఆయన ఆస్తుల విలువ రూ.163 కోట్లుగా ఏడీఆర్ నివేదికలో తేలింది.
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌కు రూ.63 కోట్ల ఆస్తులున్నాయి.