Page Loader
Jai Shankar: జైశంకర్-క్వాడ్ దేశాల భేటీ.. పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక!
జైశంకర్-క్వాడ్ దేశాల భేటీ.. పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక!

Jai Shankar: జైశంకర్-క్వాడ్ దేశాల భేటీ.. పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 02, 2025
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో నిర్వహించిన క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ తరఫున కేంద్రమంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై మంత్రులు చర్చించారు. దాదాపు 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు మృతి చెందిన ఈ దాడిని క్వాడ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనను ప్రస్తావించిన జైశంకర్ మాట్లాడుతూ నేరస్థులు, బాధితులు ఒక్కటే కాదన్న నిజాన్ని క్వాడ్ భాగస్వాములు అర్థం చేసుకోవాలని అన్నారు. దీనికి స్పందించిన క్వాడ్ నేరస్తులకు శిక్ష తప్పనిసరిగా పడాల్సిందే అని వెల్లడించింది.ప్రపంచం ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఉపేక్షించకూడదని స్పష్టం చేసింది. క్వాడ్ దేశాలైన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ ఈసమావేశంలో ఉగ్రవాదంపై ఒకే దృక్పథాన్ని ప్రదర్శించాయి.

Details

గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి

ఉగ్రవాద చర్యలు హిసాత్మక తీవ్రవాదం, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నామని క్వాడ్ వెల్లడించింది. పహల్గామ్ ఘటనపై వారు ఉమ్మడిగా ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఇంతటి అమానవీయ చర్యలకు పాల్పడినవారిని, వారికి ఆర్థికంగా సహకరించిన వారిని ఏ ఆలస్యం లేకుండా శిక్షించాలి. UNSC తీర్మానాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, అన్ని UN సభ్య దేశాలను కోరుతున్నామని అని పేర్కొన్నారు. సమావేశం అనంతరం జైశంకర్ మాట్లాడుతూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం బలోపేతం చేయడమే ఈ భేటీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

Details

భారత్ ఏ పరిస్థితుల్లోనూ లొంగదు

సమకాలీన అవకాశాలు, సవాళ్లపై చర్చించామని ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారతదేశం తీసుకుంటున్న వైఖరిని క్వాడ్ దేశాలు అర్థం చేసుకుంటున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పాకిస్తాన్ అణ్వాయుధ బ్లాక్ మెయిలింగ్ గురించి కూడా ఆయన స్పందించారు. పాక్ చేస్తున్న అణ్వాయుధ బెదిరింపులకు భారత్ ఏ పరిస్థితుల్లోనూ లొంగదని జైశంకర్ స్పష్టం చేశారు. ఈ సమావేశం ద్వారా ఉగ్రవాదంపై కఠిన వైఖరిని మన్నించలేనిదిగా ప్రకటించిన క్వాడ్, బాధితులకు మద్దతుతో పాటు నేరస్తులకు కఠిన శిక్షల పిలుపునిచ్చింది.