Loading...
Jamia Millia Islamia: జామియా మిలియా ఇస్లామియాలో ఉద్రిక్త పరిస్థితులు.. ఆన్‌లైన్‌లో తరగతులు
జామియా మిలియా ఇస్లామియాలో ఉద్రిక్త పరిస్థితులు.. ఆన్‌లైన్‌లో తరగతులు

Jamia Millia Islamia: జామియా మిలియా ఇస్లామియాలో ఉద్రిక్త పరిస్థితులు.. ఆన్‌లైన్‌లో తరగతులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలోని ప్రముఖ జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ఎన్నికలను తిరిగి నిర్వహించాలని కోరుతూ జరుగుతున్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. విద్యార్థులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ జరగడంతో క్యాంపస్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. తరగతులను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. విద్యార్థి సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా విద్యార్థులు క్యాంపస్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆందోళనకారులు నిరసన శిబిరాలను ఏర్పాటు చేసుకోగా, కొందరు విద్యార్థులు నిరాహార దీక్షకు దిగారు. ఈ శిబిరాలను పర్యవేక్షిస్తున్న సెక్యూరిటీ గార్డులు టెంట్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో వివాదం మొదలైంది.

వివరాలు 

కాంగ్రెస్ నేతల రాకతోనే క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం దెబ్బతింది: మహ్తాబ్ ఆలం

ఈ క్రమంలో విద్యార్థులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని క్యాంపస్‌లో ఉద్రిక్తత మరింత పెరిగింది.

ఈ ఘటనపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ మహ్తాబ్ ఆలం రిజ్వి స్పందించారు.

కాంగ్రెస్ నేతల రాకతోనే క్యాంపస్‌లో ప్రశాంత వాతావరణం దెబ్బతిందని ఆయన ఆరోపించారు.

గురువారం కాంగ్రెస్ ఎంపీలు ఇమ్రాన్ ప్రతాప్‌గర్హి, ఇమ్రాన్ మసూద్ గోడ దూకి విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించారని పేర్కొన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు విద్యార్థులను ఉపయోగించుకుంటున్నారని, బయటి వ్యక్తుల జోక్యం కారణంగానే విద్యార్థులు ఆగ్రహానికి గురయ్యారని విమర్శించారు.

ఈ వ్యవహారంపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిజ్వి వెల్లడించారు.

వివరాలు 

విద్యార్థి సంఘాలు భిన్నమైన వాదనలు

మరోవైపు, ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు ఎలాంటి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడకపోయినా, యూనివర్సిటీ యాజమాన్యం వారిపై అనవసరంగా దాడి చేసిందని వామపక్ష విద్యార్థి సంఘం ఐసా (AISA) ఆరోపించింది.

విద్యార్థుల పట్ల సెక్యూరిటీ గార్డులు దురుసుగా ప్రవర్తించారని మండిపడింది.

అయితే, విద్యార్థులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ యాజమాన్యం ఖండించింది.

ADVERTISEMENT

వివరాలు 

2006లో విద్యార్థి సంఘం రద్దు 

జామియా మిలియా ఇస్లామియా విద్యార్థి సంఘం (JMISU)ను తిరిగి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో అక్టోబర్ 12 నుంచి విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.

2006లో క్యాంపస్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో పాటు విద్యా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో అప్పట్లో విద్యార్థి సంఘాన్ని రద్దు చేశారు.

అప్పటి నుంచి సంఘాన్ని పునరుద్ధరించాలని విద్యార్థులు పలుమార్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఆ డిమాండ్ నెరవేరలేదు.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జామియా వర్సిటీలో విద్యార్థుల ఆందోళన

ADVERTISEMENT