అమర్‌నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు
ఈ వార్తాకథనం ఏంటి
అమరనాథుడి యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మారోగ్ రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
పంత చౌక్ యాత్ర బేస్ క్యాంపు నుంచి జమ్మూకు వెళ్లాల్సిన అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. జులై 1న ప్రారంభించిన యాత్ర ఆగస్టు 31 వరకు కొనసాగనుంది.
కొండచరియలు విరిగిపడ్డ క్రమంలో జాతీయ రహదారి-44పై ప్రయాణం చేయవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.
మరోవైపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమరనాథ్ యాత్ర మార్గంలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
బలగాలు సహా పూంచ్ పౌర సొసైటీ సహకారంతో అమర్‌నాథ్ యాత్రను ప్రశాంతంగా ముగించేలా చర్యలు చేపట్టామని జమ్మూ కశ్మీర్ పోలీసులు వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాంబన్ వద్ద విరిగిపడిన కొండచరియలు
Jammu-Srinagar highway blocked due to landslide in Ramban, Amarnath Yatra halted
— ANI Digital (@ani_digital) August 9, 2023
Read @ANI Story |
https://t.co/0bYRenQzRQ#JammuKashmir #amarnathyatra2023 #Srinagar pic.twitter.com/LBxUw0wVkd