LOADING...
Bihar Elections 2025: జన్ సురాజ్ పార్టీ రెండో జాబితా రిలీజ్.. 65 అభ్యర్థులతో ప్రకటన 
జన్ సురాజ్ పార్టీ రెండో జాబితా రిలీజ్.. 65 అభ్యర్థులతో ప్రకటన

Bihar Elections 2025: జన్ సురాజ్ పార్టీ రెండో జాబితా రిలీజ్.. 65 అభ్యర్థులతో ప్రకటన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సూరజ్ పార్టీ సోమవారం (అక్టోబర్ 13) రాబోయే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు 65 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. అయితే రాఘోపూర్ నుంచి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌పై పోటీ చేయనున్న కిషోర్ పేరు జాబితాలో చోటు పొందలేదు. మూడు దశాబ్దాల పాటు నితీష్ కుమార్ పోటీ చేయని హర్నాట్ స్థానం, ఆయనకు బలమైన కోటగా భావించబడుతుంది. ఈ స్థానానికి కమలేష్ పాశ్వాన్‌ను పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెట్టారు. కొత్త జాబితాలో 20 రిజర్వ్డ్ నియోజకవర్గాలు (19 షెడ్యూల్డ్ కులాలు, 1 షెడ్యూల్డ్ తెగ) 46 అన్ రిజర్వ్డ్ స్థానాలకు అభ్యర్థులు ఉన్నారు.

Details

116 సీట్లకు అభ్యర్థుల ప్రకటన

పార్టీ ప్రకటన ప్రకారం, 10మంది హిందూ, నలుగురు ముస్లిములు వెనుకబడిన అత్యంత పేద వర్గాల నుండి, 10మంది ఇతర వెనుకబడిన వర్గాల నుంచి, 11 మంది రిజర్వ్డ్ వర్గాల నుంచి, 14మంది మైనారిటీ వర్గాల నుంచి అభ్యర్థులు ఉన్నారు. హర్నాట్ వర్ధమాన్ అసెంబ్లీ స్థానంలో SC/ST అభ్యర్థిని కూడా నిలిపి విస్తృత భాగస్వామ్యాన్ని నిర్ధారించారు. రెండో జాబితాతో పార్టీ మొత్తం 116 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మొదటి జాబితాలో 51 సీట్ల అభ్యర్థులను ప్రకటించాం, రెండో జాబితాలో 65 సీట్లను ప్రకటించాం. మిగిలిన సీట్లకు తరువాత ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల్లో 31 మంది అత్యంత పేద వర్గాలకు, 21మంది ఇతర వెనుకబడిన వర్గాలకు, 21 మంది ముస్లిములున్నారని కిషోర్ వివరించారు.

Details

కార్గహార్ నుంచి ప్రముఖ భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే

అక్టోబర్ 9న, జన్ సూరజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను విడుదల చేసింది. ఇందులో మాజీ కేంద్ర మంత్రి ఆర్‌సిపి సింగ్ కుమార్తె లతా సింగ్, సమస్తిపూర్‌లోని మోర్వా నుంచి సోషలిస్ట్ నాయకుడు కర్పూరి ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్ తదితరులు ఉన్నారు. ప్రముఖ భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే కార్గహార్ నుంచి, గణిత శాస్త్రవేత్త కెసి సిన్హా కుమ్రార్ నుంచి పోటీ చేయనున్నారు. బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలపై ఎన్నికలు రెండు దశల్లో-నవంబర్ 6, 11న పోలింగ్, లెక్కింపు నవంబర్ 14న జరగనున్నాయి. ఈ ఏడాది బీహార్ ఎన్నికలుNDA, INDIAకూటమి, మరియు ప్రశాంత్ కిషోర్ కొత్తగా స్థాపించిన జన్ సూరజ్ పార్టీ మధ్య ఘట్టపూర్వక త్రిముఖ పోటీగా మారనున్నాయి.