LOADING...
Stalin: 'జన నాయగన్‌' వివాదం.. విజయ్‌కు అండగా నిలిచిన సీఎం స్టాలిన్
'జన నాయగన్‌' వివాదం.. విజయ్‌కు అండగా నిలిచిన సీఎం స్టాలిన్

Stalin: 'జన నాయగన్‌' వివాదం.. విజయ్‌కు అండగా నిలిచిన సీఎం స్టాలిన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 10, 2026
12:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సెన్సార్‌బోర్డు ధ్రువీకరణ పత్రం జారీ చేయకపోవడంతో విజయ్‌ కథానాయకుడిగా నటించిన 'జన నాయగన్‌' (Jana Nayagan) సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విజయ్‌కు మద్దతుగా నిలిచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని స్టాలిన్‌ ఆరోపించారు. తాజాగా ఈ జాబితాలో సెన్సార్‌ బోర్డు కూడా చేరిందని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సీబీఎఫ్‌సీని కూడా ఆయుధంగా మార్చుకుంటోందని పేర్కొంటూ, ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

Details

విజయ్ మద్దతుగా కాంగ్రెస్ నేతలు

ఈ అంశంలో తమిళనాడు కాంగ్రెస్‌ నేతలు కూడా విజయ్‌కు అండగా నిలిచారు. తమిళనాడుపై బీజేపీ చేపట్టే ఏ చర్యనైనా అన్ని రాజకీయ పార్టీలు కలిసికట్టుగా వ్యతిరేకించాలని లోక్‌సభ ఎంపీ జోతిమణి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, 'జన నాయగన్‌' సినిమాకు సెన్సార్‌ క్లియరెన్స్‌ జాప్యం వెనుక కేంద్ర ప్రభుత్వ హస్తం ఉందన్న ఆరోపణలను బీజేపీ ఖండించింది. సెన్సార్‌ బోర్డు నిబంధనల ప్రకారమే బోర్డు సభ్యులు సినిమాలపై నిర్ణయం తీసుకుంటారని, దీనిని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారు.

Advertisement