Page Loader
దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు?
దిల్లీలో పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు?

దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు?

వ్రాసిన వారు Stalin
Apr 03, 2023
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం పవన్ పర్యటించారు. పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం దిల్లీకి చేరుకున్నారు. బీజేపీ సీనియర్ నేతలతో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారని జనసేన నేతలు భావిస్తున్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలతో పవన్, మనోహర్ భేటీ కానున్నారు. జనసేన, బీజేపీల మధ్య గ్యాప్ ఉందన్న వార్తల మధ్య పవన్ దిల్లీ పర్యటన, కమలం పార్టీ అగ్రనేతలతో భేటీ కానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఇటీవలి సంఘటనలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై పవన్ బీజేపీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్

వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమిలో బీజేపీ చేరుతుందా?

పవన్ దిల్లీ పర్యటనను వైఎస్సార్సీపీ నేతలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ కూడా వరుస దిల్లీ పర్యటనలు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ చేతిలో వైఎస్సార్సీపీ 3 స్థానాలకు గానూ 3 ఓడిపోయింది. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో వైసీపీ 1 ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. ఇవి రాష్ట్ర రాజకీయ పరిణామాలను మార్చేశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చబోమని పవన్ పదే పదే చెబుతున్నారు. ఈ మాటలతో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ తన పార్టీ నేతలకు పరోక్ష సంకేతాలు ఇస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ముందుకు సాగుతుందా? దిల్లీ పర్యటనలో బీజేపీ అగ్రనేతలతో పవన్ ఏం చర్చిస్తారు?