శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో శ్రీరామనవమి వేడుకల అనంతరం ఆదివారం నిర్వహించిన స్వామివారి ఊరేగింపులో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘటనలో ఘటనలో బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు. బెంగాల్‌లో ఏప్రిల్ 30న శ్రీరామనవమి వేడుకల తర్వాత నిర్వహించిన పలు శోభాయాత్రల్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం నిర్వహించిన ఊరేగింపులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ పాల్గొన్నారు. ఈ శోభాయాత్రంలో ఘర్షణ నెలకొనగా ఎమ్మెల్యే బిమన్ ఘోష్ ఆసుపత్రి పాలయ్యారు.
24 గంటల పాటు ఇంటర్నెట్ సేవల నిలిపివేత
ఘర్షణ నేపథ్యంలో వచ్చే 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్లు, 144సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇరు వర్గాల ఘర్షణ దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం, పరిగెత్తడం లాంటి దృశ్యాలు అందులో కనపడుతున్నాయి. రామనవమి ఊరేగింపు సందర్భంగా డీజే సౌండ్‌ను బాగా పెంచడంతో మరో వర్గం వారు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఘర్షణ నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. హింసకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తెలిపారు.