Page Loader
శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం
శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం

శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం

వ్రాసిన వారు Stalin
Mar 30, 2023
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఏలూరులోని తణుకు మండలం దువ్వలో శ్రీరామ నవమి వేడుక కోసం వేసిన చలువ పందిళ్లకు మంటలు అంటున్నాయి. ఒక్కసారిగా మంటలు చేలరేగడంతో భక్తులు భయాందోళనకు గుగరయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శ్రీరామనవమి

షార్ట్ సర్క్యూట్ వల్లే మంటల వ్యాప్తి; పోలీసుల అనుమానం

చలువ పందిళ్లకు ఎలా మంటలు అంటుకున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగే మంటలు వ్యాపించి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి కల్యాణాన్ని వీక్షించాలని వచ్చిన భక్తులకు ఈ ఘటన జరగడంతో షాక్‌కు గురయ్యారు. వాస్తవానికి ప్రతి ఏడాది దువ్వలో శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలో ప్రమదం జరగడంతో భక్తులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.