Page Loader
ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు
ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు

ఏలూరు: భీమడోలు జంక్షన్‌లో ఎస్‌యూవీని ఢీకొన్న 'దురంతో ఎక్స్‌ప్రెస్' రైలు

వ్రాసిన వారు Stalin
Mar 30, 2023
01:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న 'దురంతో ఎక్స్‌ప్రెస్‌' రైలు గురువారం తెల్లవారుజామున ఎస్‌యూవీని ఢీకొట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలోని భీమడోలు మండలంలో ఈ ఘటన జరగడంతో ఆ మార్గం గుండా వెళ్లే పలు రైళ్లు ఆరు గంటలకు పైగా ఆలస్యంగా వెళ్లాయి. తెల్లవారుజామున 3 గంటలకు దురంతో ఎక్స్‌ప్రెస్ రావడంతో భీమడోల్ జంక్షన్ వద్ద రైల్వే క్రాసింగ్ గేట్ మూసివేయబడింది. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఎస్‌యూవీ వాహనంలో ఉన్న కొందరు వ్యక్తులు మూసి ఉన్న గేటును ఢీకొట్టారు. దీంతో ఆ వాహనం ట్రాక్స్ మీదకు వెళ్లి ఆగింది.

రైలు

వాహనం వదిలేసి పారిపోయిన వారి కోసం పోలీసుల గాలింపు

ఎస్‌యూవీ వాహనం ముందుకు వెళ్లకపోవడంతో కారులో ఉన్న వారు వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పారిపోయారు. అదే సమయంలో వేగంగా వచ్చిన 'దురంతో ఎక్స్‌ప్రెస్‌' భీమడోలు జంక్షన్ సమీపంలో కారు ఢీకోట్టింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. రైలు ఇంజన్ ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాదం విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు 'దురంతో ఎక్స్‌ప్రెస్‌'‌కు మరో ఇంజిన్ జత చేశారు. అయితే ఈ ట్రాక్‌పై రైళ్లు నిలిపివేయడంతో ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి వచ్చింది. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి వాహనం వదిలేసి పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు.