ఆంధ్రప్రదేశ్: 14 స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 162మంది వైద్య నిపుణుల నియామకం
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమానికి చెందిన వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో నిపుణులైన వైద్యుల నియామకం కోసం వాక్-ఇన్ ఇంటర్వ్యూలు ముగిశాయి. ఈ నెల 23 నుంచి మంగళవారం వరకు నిర్వహించిన ఇంటర్వ్యూల్లో 14 స్పెషాలిటీల్లో 162 పోస్టులు భర్తీ అయ్యాయి. ఏపీవీవీపీ 14 స్పెషాలిటీలలో 319 పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. 316 మంది వైద్యులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం అత్యవసర అనుమతి
రిక్రూట్ అయిన 162 పోస్టుల్లో 112 పోస్టులు పర్మినెంట్ కాగా, 50 పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్ మెడిసిన్ 28, జనరల్ సర్జరీ 27, గైనకాలజీ 33, అనస్థీషియా 22, పాథాలజీ 12, పీడియాట్రిక్స్ 12 మరియు మిగిలిన వాటిలో ఇతర స్పెషాలిటీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రధాన్యమిస్తోంది. రాష్ట్రంలోని స్పెషాలిటీ ఆస్పత్రుల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం అత్యవసర అనుమతి ఇచ్చింది. అందులో భాంగానే ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టింది.