Loading...
Jana Sena: మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జైత్రయాత్ర.. మళ్లీ 100% స్ట్రైక్‌రేట్
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జైత్రయాత్ర.. మళ్లీ 100% స్ట్రైక్‌రేట్

Jana Sena: మున్సిపల్ ఎన్నికల్లో జనసేన జైత్రయాత్ర.. మళ్లీ 100% స్ట్రైక్‌రేట్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయభేరి మోగించింది. కీలకమైన విజయవాడ నగర మేయర్‌ స్థానంలో భారీ విజయం దిశగా దూసుకెళ్తుండగా.. ఏలూరు కార్పొరేషన్‌తోపాటు పోటీ చేసిన ఇతర మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ విజయాలను నమోదు చేసింది. దీంతో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందిన పార్టీగా వందశాతం స్ట్రైక్‌ రేటును సాధించింది. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు నాలుగు కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో పోటీ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన రెండు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో విజయం సాధించి రికార్డు సృష్టించింది.

వివరాలు 

పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలోని రెండు మున్సిపాలిటీలతోపాటు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోని మున్సిపాలిటీలను పొత్తులో భాగంగా జనసేన తీసుకుంది.

అదే సమయంలో కొత్త ప్రాంతాల్లో పార్టీని విస్తరించేందుకు మరికొన్ని స్థానాలను ఎంచుకుంది.

కొత్త నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకునేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకుంది.

వైకాపా, తెదేపాల నుంచి వచ్చిన నాయకులకు కూడా కొన్ని చోట్ల అవకాశం కల్పించింది. తద్వారా ఆయా ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేసింది.

వివరాలు 

అదే రికార్డు మళ్లీ..

2024లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలుపొందిన జనసేన.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ అదే రికార్డును కొనసాగించింది.

పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని మున్సిపాలిటీలను పొత్తులో భాగంగా తీసుకుని పోటీ చేసింది.

మరోవైపు కొత్త నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకత్వాన్ని విస్తరించేలా వ్యూహాలు రచించింది.

పిఠాపురం, తెనాలి, పాలకొండ, తాడేపల్లిగూడెం, భీమవరం, నరసాపురం, కాకినాడ వంటి ప్రాంతాల్లో ప్రస్తుతం పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నారు.

అక్కడ కూడా మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో పొత్తులో భాగంగా స్థానాలను తీసుకుంది. అయితే కాకినాడ, తాడేపల్లిగూడెం, భీమవరాల్లో ప్రస్తుతం ఎన్నికలు జరగలేదు.

ADVERTISEMENT

వివరాలు 

అదే రికార్డు మళ్లీ..

మరోవైపు కీలకమైన విజయవాడలో పార్టీకి నాయకత్వాన్ని అందించేందుకు మేయర్‌ స్థానానికి జనసేన పోటీ చేసింది.

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను బరిలోకి దింపి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది.

ప్రధాన నగరాల్లో ఒకటైన విజయవాడలో ఇప్పటివరకు జనసేనకు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం లేదు.

తాజా ఎన్నికలతో నగరంలో పార్టీ ప్రాతినిధ్యాన్ని సాధించే దిశగా అడుగులు వేసింది.

ఏలూరు కార్పొరేషన్, శ్రీకాకుళం ప్రాంతాల్లో పార్టీని విస్తరించేందుకు కూడా పొత్తు కుదుర్చుకుంది.

తుని, పెద్దాపురం పరిధిలోని సామర్లకోట మున్సిపాలిటీ, దర్శి, తిరువూరు, చిలకలూరిపేట, ముమ్మిడివరం, అమలాపురం, పెడన, మడకశిర, పుట్టపర్తి, నగరి పరిధిలోని పుత్తూరు మున్సిపాలిటీల్లోనూ పోటీ చేసే స్థానాలను తీసుకుంది.

ఆయా ప్రాంతాల్లో గెలుపొందడం ద్వారా పార్టీ విస్తరణకు బాటలు వేసుకుంది.

ADVERTISEMENT

వివరాలు 

అదే రికార్డు మళ్లీ..

ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల తెదేపా, వైకాపాల నుంచి వచ్చిన నాయకులకు జనసేన అవకాశం కల్పించింది.

వారిలో పలువురు విజయం సాధించారు. రాబోయే రోజుల్లో ఆయా ప్రాంతాల్లో పార్టీ మరింత బలపడేందుకు ఈ విజయాలు ఉపయోగపడతాయని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి.

వివరాలు 

పిఠాపురంలో 10 మంది రెబల్స్‌ విజయం

ఉప ముఖ్యమంత్రి పవన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం పురపాలికలో కూటమి అభ్యర్థులు విజయం సాధించి సంపూర్ణ మెజారిటీ దక్కించుకున్నారు.

అయితే,ఇక్కడ 10 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలవడం చర్చనీయాంశంగా మారింది.

వీరిలో ఎనిమిది మంది కూటమి రెబల్స్‌ కాగా,మరో ఇద్దరు వైకాపా రెబల్స్‌ ఉన్నారు.

జనసేన తరఫున ఛైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన దానం లాజర్‌బాబు తన సమీప ప్రత్యర్థి పెదపాటి రాజేష్‌కుమార్‌పై 9,235 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

పిఠాపురం పురపాలికలో మొత్తం 36 వార్డులు ఉండగా, వీటిలో మూడు వార్డులు ఇప్పటికే జనసేనకు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 33 వార్డుల్లో జనసేన 16, తెదేపా ఐదు, భాజపా ఒకటి, స్వతంత్ర అభ్యర్థులు 10 వార్డుల్లో గెలుపొందారు.

వివరాలు 

పోటీపై సర్వత్రా ఆసక్తి..

వైకాపా కేవలం 19వ వార్డులో మాత్రమే విజయం సాధించింది. ఏకగ్రీవ స్థానాలను కలుపుకొని కూటమికి మొత్తం 25 వార్డులు దక్కాయి.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గం కావడంతో పిఠాపురం పురపాలిక ఎన్నికలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

ఇక్కడ కూటమి పొత్తులో భాగంగా తెదేపాకు తొమ్మిది వార్డులు కేటాయించారు. అయితే, అదే పార్టీ నుంచి మరో 10 మంది రెబల్స్‌గా పోటీ చేశారు.

జనసేన 23 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. ఆ పార్టీకి చెందిన మరో 11 మంది రెబల్స్‌గా బరిలోకి దిగారు.

వివరాలు 

పోటీపై సర్వత్రా ఆసక్తి..

రెబల్స్‌ నామినేషన్లు ఉపసంహరించుకునేలా కూటమి నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.

దీంతో ఆయా వార్డుల్లో వైకాపా అభ్యర్థుల కంటే రెబల్స్‌తోనే ప్రధాన పోటీ ఎదురైంది. చివరకు 10 మంది రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు.

పిఠాపురం పురపాలికలో వైకాపా ఒక్క వార్డులో మాత్రమే గెలుపొందడం గమనార్హం.

ADVERTISEMENT