LOADING...
Janasena: జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, పృథ్వీ
జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, పృథ్వీ

Janasena: జనసేన స్టార్ క్యాంపెయినర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, పృథ్వీ

వ్రాసిన వారు Stalin
Apr 10, 2024
07:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన స్టార్ క్యాంపెనర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, పృథ్వీలను నియమిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతో పాటు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీ, టీవీ నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ కూడా స్టార్ క్యాంపెయినర్లుగా వ్యవహరిస్తారు. ఈ మేరకు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ బుధవారం లేఖను విడుదల చేశారు. ఏపీ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ సీట్లను దక్కించుకుని ప్రభుత్వంలో భాగం కావాలని చూస్తున్న జనసేన పార్టీ ఈసారి ఎన్నికల్లో 20కు పైగా సీట్లలో పోటీ చేస్తోంది. పవన్ కళ్యాణ్ స్వయంగా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జనసేన పార్టీ చేసిన ట్వీట్