Loading...
Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం ఆగదు: సీజేపీ హెచ్చరిక
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం ఆగదు: సీజేపీ హెచ్చరిక

Abhijeet Dipke: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు ఉద్యమం ఆగదు: సీజేపీ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ(కాక్రోచ్ పార్టీ)చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రాత్రికే తమ పార్టీకి చెందిన మొత్తం బృందాన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒకవేళ అరెస్టులు జరిగినా ఉద్యమం మాత్రం పూర్తిగా శాంతియుతంగానే కొనసాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో దిల్లీలో ఈరోజు పరిస్థితులు ఎలా ఉండబోతాయన్న ఉత్కంఠ నెలకొంది. జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దీప్కే.. ప్రభుత్వం అరెస్టులకు పాల్పడి మరో తప్పు చేయవద్దని కోరారు. అరెస్టులు చేస్తే ఉద్యమం మరింత ఉధృతం అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. తాము అదుపులోకి తీసుకున్నా ఆందోళనకారులు శాంతియుత మార్గాన్నే అనుసరించాలని సూచించారు.

వివరాలు 

పరీక్షల వ్యవస్థలో జవాబుదారీతనం ఏర్పడే వరకు తమపోరాటం కొనసాగుతుంది: దీప్కే

ఈ సందర్భంగా సోనం వాంగ్‌చుక్ 26రోజుల నిరాహార దీక్షను విరమించడం సంతోషకర పరిణామమని దీప్కే పేర్కొన్నారు.

ఆయన ఆరోగ్యం విషయంలో తమకు తీవ్రఆందోళన ఉందని చెప్పారు.

26రోజులకు పైగా ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆయన చేసిన పోరాటం దేశానికి ఎంతో విలువైనదని,వాంగ్‌చుక్ వంటి వ్యక్తి జీవితం దేశానికి అవసరమని వ్యాఖ్యానించారు.

అయితే సీజేపీ ఉద్యమం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోదని ఆయన స్పష్టం చేశారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్ మంతర్ వద్ద ధర్నా కొనసాగుతుందని ప్రకటించారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప తమకు మరో పరిష్కారం ఆమోదయోగ్యం కాదని,విద్యార్థులకు న్యాయం జరిగే వరకు,పరీక్షల వ్యవస్థలో జవాబుదారీతనం ఏర్పడే వరకు తమపోరాటం కొనసాగుతుందని తేల్చిచెప్పారు.

వివరాలు 

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే ప్రధాన డిమాండ్

కేంద్ర మంత్రులతో జరగనున్న సమావేశంపై స్పందించిన దీప్కే.. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా తటస్థ వేదికలోనే చర్చలు జరగాలని కోరుకుంటున్నామని తెలిపారు.

తమ ప్రధాన డిమాండ్ల విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని స్పష్టం చేశారు.

నీట్ పేపర్ లీక్ వివాదం,పోటీ పరీక్షల్లో జరిగిన అవకతవకలు,విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టడం,విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని సీజేపీ డిమాండ్ చేస్తోందన్నారు.

మరోవైపు సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే తమ ప్రధాన డిమాండ్ అని, అది నెరవేరే వరకు ఉద్యమం నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డాతో సమావేశం

ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జేపీ నడ్డాతో సమావేశం జరగనుందని తెలిపారు.

ఆ సమావేశానికి జితేంద్ర సింగ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం అందిందన్నారు. చర్చల్లో జరిగిన విషయాలను అనంతరం మీడియాకు వెల్లడిస్తామని చెప్పారు.

సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తుండటంతో ఆయన నిరాహార దీక్షను విరమించాలని తాము నిరంతరం కోరుతున్నామని రంకా వెల్లడించారు.

తమ రెండు ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు.

శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని, అలాగే బాధిత కుటుంబాలకు తగిన పరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.

అయితే ఆ హామీలతో తమ ఉద్యమం ముగిసినట్లు కాదని స్పష్టం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై స్పందించిన అశుతోష్ రంకా

ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన వీడియోపై కూడా అశుతోష్ రంకా స్పందించారు.

ప్రభుత్వంపై ప్రజల ఒత్తిడి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. తొలిసారిగా ప్రధానమంత్రి అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియో విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ప్రస్తుతం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోందన్నారు.

యువత భవిష్యత్తుపై ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే అత్యంత కఠినమైన చర్యగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

ADVERTISEMENT