Page Loader
PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం 
PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం

PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం 

వ్రాసిన వారు Stalin
Jan 16, 2024
10:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ (NACIN ) కొత్త క్యాంపస్‌ను మోదీ ప్రారంభిస్తారు. ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లాలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలోని వీరభద్ర దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంకు ప్రధాని మోదీ చేరుకుంటారు. ఆ తర్వాత నార్కోటిక్స్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మోదీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లోని 74వ, 75వ బ్యాచ్‌కి చెందిన ట్రైనీలు ఆఫీసర్లు, భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో ఇంటరాక్ట్ అవుతారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

లేపాక్షి  ఆలయంలో పూజలు చేయనున్న మోదీ