Page Loader
Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం 
Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం

Jagaanna Aarogya Suraksha: 'జగనన్న ఆరోగ్య సురక్ష' రెండో దశ ప్రారంభం 

వ్రాసిన వారు Stalin
Jan 02, 2024
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమం చేపట్టింది. గతేడాది నవంబర్‌లో 'జగనన్న ఆరోగ్య సురక్ష' మొదటి విడతను చేపట్టిన సర్కారు.. మంగళవారం( జనవరి 2) నుంచి రెండో విడతను ప్రారంభించింది. రెండో దేశను 6 నెలల పాటు నిర్వహించనున్నారు. ఇందుకోసం 13,945ఆరోగ్య శిబిరాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిదశలో 12,423 ఆరోగ్య శిబిరాల్ని నిర్వహించారు. తద్వారా 1,64,982 మంది పేషెంట్లకు వైద్య సేవలను అందించారు. నాణ్యమైన ఆరోగ్య సేవలను ఉచితంగా అందించే విషయంలో ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదిలిపెట్టొద్దని జగన్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను ఆదేశించింది.

ఏపీ

మొదటి విడత 50 రోజుల్లో పూర్తి 

'ఆరోగ్య ఆంధ్రప్రదేశ్' సాధనకు జగన్ ప్రభుత్వం శాఖ కృషి చేస్తోంది. జగనన్న ఆరోగ్య సురక్ష మొదటి విడత కార్యక్రమాన్ని 50 రోజుల్లో పూర్తి చేశారు. జేఏఎస్-1 మొదటి విడత కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత.. అన్ని గ్రామాలు, వార్డు సచివాలయాలను కవర్ చేస్తూ ఆరు నెలల పాటు అన్ని మండలాలు, పట్టణ స్థానిక సంస్థలలో నిరంతరంగా "జగనన్న ఆరోగ్య సురక్ష-2 కార్యక్రమం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జేఏఎస్ 2 ఆరోగ్య శిబిరాల్లో స్పెషలిస్ట్ కేర్ అందించేందుకు జనరల్ మెడిసిన్-543, గైనకాలజిస్టులు-645, జనరల్ సర్జన్లు-349, పీడియాట్రిషియన్స్-285, ఆర్థోపెడిక్స్-345, ఇతర స్పెషలిస్టులు- 378 సేవలు అందించనున్నారు.