LOADING...
January 2026 Holidays : స్కూళ్లు,కాలేజీలకు ఫుల్ జాలీ.. జనవరి 2026లో 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..
జనవరి 2026లో 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..

January 2026 Holidays : స్కూళ్లు,కాలేజీలకు ఫుల్ జాలీ.. జనవరి 2026లో 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 26, 2025
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

విద్యార్థులకు నిజంగా పండగ వాతావరణమే కనిపించనుంది. వచ్చే జనవరి 2026లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా భారీ సెలవులు రానున్నాయి. పండగ సెలవులు, వారాంతపు విరామాలు కలిసిరావడంతో చాలామందికి దీర్ఘకాలం ఖాళీ దొరకనుంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని చాలామంది ట్రిప్‌లను ప్లాన్ చేయాలని భావిస్తున్నారు. మీరు కూడా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా? అయితే జనవరి 2026 సెలవుల షెడ్యూల్ మీకోసమే. ఈ నెలలో సంక్రాంతి సెలవులే కాకుండా, నెల చివర్లో రిపబ్లిక్ డే వరకు వరుసగా హాలిడేస్ ఉన్నాయి. ఈ సమయంలో ప్రయాణాలకు వెళ్లేవారు పూర్తిగా రిలాక్స్ అయి ఎంజాయ్ చేయవచ్చు.

వివరాలు 

సంవత్సరం మొదట్లోనే లాంగ్ బ్రేక్

సాధారణంగా ప్రతి ఏడాది జనవరిలో విహారయాత్రలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే సెలవులు దొరికితే చాలు, ఎక్కడికి వెళ్లాలా అని చాలామంది ప్లాన్‌లలో మునిగిపోతుంటారు. 2026లో జనవరి 1వ తేదీ గురువారం కావడంతో, కొత్త సంవత్సరానికి హాలిడే లభిస్తుంది. అదే విధంగా, జనవరి 2వ తేదీ శుక్రవారం ఒక్క రోజు సెలవు తీసుకుంటే, ఆ వెంటనే శని, ఆదివారాలు రావడంతో మొత్తం నాలుగు రోజుల విరామం దొరుకుతుంది. సంవత్సరం మొదట్లోనే ఇలాంటి లాంగ్ బ్రేక్ రావడం వల్ల సమీపంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ఇది మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల్లోని పాఠశాలలకు జనవరిలో ఆదివారాలు,రెండో శనివారం,నాలుగో శనివారంతో పాటు సంక్రాంతి,రిపబ్లిక్ డే సెలవులు ఉన్నాయి.

వివరాలు 

సంక్రాంతి సంబరాలు చేసుకోవచ్చు : 

వచ్చే జనవరిలో సంక్రాంతి పండగకు సంబంధించి 13 లేదా 14 నుంచి 18వ తేదీ వరకు వరుస సెలవులు ఉండనున్నాయి. భోగి, సంక్రాంతి, కనుమ పండగలతో పల్లెల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ సెలవులను ఉపయోగించుకొని బంధువుల ఇళ్లకు వెళ్లి సంబరాలు చేసుకోవచ్చు. జనవరి చివర్లో కూడా మరో మంచి అవకాశం ఉంది. జనవరి 26 సోమవారం రిపబ్లిక్ డే కావడంతో హాలిడే ఉంటుంది. అంతకుముందు 24, 25 తేదీలు శని, ఆదివారాలు కావడంతో ఇప్పటికే రెండు రోజుల విరామం ఉంటుంది. జనవరి 23 శుక్రవారం వసంత పంచమి సెలవు తీసుకుంటే, వరుసగా నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయవచ్చు.

Advertisement

వివరాలు 

పర్యాటక ప్రాంతాల్లో భారీగా జనసందడి ఉండే అవకాశం 

మొత్తంగా చూస్తే ఈ నెలలో విద్యార్థులకు 10 నుంచి 12 రోజుల వరకు సెలవులు లభించే అవకాశం ఉంది. పరీక్షలు ప్రారంభమయ్యే ముందే ఈ సమయాన్ని హాయిగా గడపవచ్చు.ఒకే నెలలో ఇన్ని వరుస సెలవులు ఉండటంతో పర్యాటక ప్రాంతాల్లో భారీగా జనసందడి ఉండే అవకాశం ఉంది. అందుకే ముందుగానే హోటల్ బుకింగ్స్, రైలు,విమాన టికెట్ల ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. జనవరి 2026 హాలిడేస్‌ను పూర్తిగా ఆస్వాదించాలంటే ఇప్పుడే ప్లానింగ్ మొదలుపెట్టడం మంచిది. దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకునే వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటే తక్కువ ధరల్లో లభిస్తాయి. ఈ జనవరిలో కుటుంబ సభ్యులు,స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లి సెలవులను మరిచిపోలేని అనుభవంగా మార్చుకోవచ్చు.

Advertisement