Barrelakka shirisha: బర్రెలక్కకు మద్దతుగా రంగంలోకి జేడీ లక్ష్మీనారాయణ.. కొల్లాపూర్‌లో ప్రచారం
బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న పేరు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు ఆమె పేరు సంచలనంగా మారింది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో శిరీష కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తోంది. నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు పోటీ చేస్తున్న ఆమెకు విశేషమైన మద్దతు లభిస్తోంది. పార్టీలకతీతంగా ఆమెకు ఆర్థికంగా, ప్రత్యేక్షంగా, పరక్షంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే బర్రెలక్కకు మద్దతుగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రంగంలోకి దిగారు. శిరీష తరఫున శనివారం ప్రచారం నిర్వహించారు. అనంతరం జేడీ మాట్లాడుతూ.. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారానికి శిరీష లాంటి వారు అవసరమని పేర్కొన్నారు. శిరీష ఎమ్మెల్యే అయితే మొదట తానే ఆనందపడుతానని వెల్లడించారు.
శిరీషకు భద్రత విషయంలో పోలీసుల జాప్యం
ఇదిలా ఉంటే, బర్రెలక్క ఎన్నికల ప్రచారంలో ఆమె భద్రత అంశం కూడా చర్చనీయాశంగా మారింది. ఇటీవల శిరీష ప్రచారం చేస్తున్న సమయంలో ఆమె దాడి జరిగింది. ఈ క్రమంలో శిరీషకు భద్రత కల్పించాలని తెలంగాణ హైకోర్టు.. పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు కోర్టు ఆదేశాలను పాటించడం లేదని, శిరీష తరఫు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. ఈనేపథ్యంలో కోర్టు ఆదేశాలిచ్చినా.. శిరీషకు భద్రత కల్పించకపోవడంతో ఆమె తరఫున న్యాయవాదులు మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. కొర్టు దిక్కరణ కింద.. పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు యోచనలో ఉన్నారు.